Mon Dec 23 2024 02:16:58 GMT+0000 (Coordinated Universal Time)
ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ తీవ్ర ప్రయత్నాలు.. ఫలించేనా..?
ఆస్కార్ అవార్డులకు సంబంధించిన 15 కేటగిరీలకు
ఆస్కార్ అవార్డులకు సంబంధించి ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ చాలా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఆస్కార్ అవార్డులకు సంబంధించిన 15 కేటగిరీలకు నామినేషన్స్ పంపిస్తోంది. గుజారాతీ సినిమా 'చెల్లో షో'ని అస్కార్ కు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధికారిక ఎంట్రీగా ప్రకటించింది. అయితే ఈ సినిమాను నేరుగా ఆస్కార్ కు పంపించేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నాలను ప్రారంభించింది. అమెరికాలో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన సంస్థ ఆస్కార్ అవార్డులకు పంపడానికి గట్టి ప్రయత్నాలు చేస్తుంది. ఫర్ యువర్ కన్సిడరేషన్ (FYC) కింద ప్రజల్లోకి సినిమాను తీసుకెళుతుంది. స్పెషల్ స్క్రీనింగ్ను ఏర్పాటు చేసింది. దీనికి ఆడియెన్స్ పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. సినిమాను తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
15 కేటగిరీలు ఇవే:
బెస్ట్ మోషన్ పిక్చర్
బెస్ట్ డైరెక్టర్ - రాజమౌళి
బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే
బెస్ట్ యాక్టర్ : జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ : అజయ్ దేవగన్
బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్: అలియా భట్
బెస్ట్ సినిమాటోగ్రఫీ : కేకే సెంథిల్ కుమార్
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ : నాటు నాటు
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ : సాబు సిరిల్
బెస్ట్ ఒరిజినల్ స్కోర్ : ఎంఎం కీరవాణి
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ : రమా రాజమౌళి
బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్
బెస్ట్ మేకప్, హెయిర్ స్టైలింగ్ : నల్ల శ్రీను, సేనాపతి నాయుడు
బెస్ట్ సౌండ్
బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ : వి. శ్రీనివాస్ మోహన్.
Next Story