కరోనాపై RRR హీరోల సూచనలు – సలహాలు
కరోనా వ్యాప్తి చెందకుండా.. మనల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకోవడానికి, కరోనా పై ఉన్న భయాలను ప్రారదోలడానికి.. RRR హీరోలైన ఎన్టీఆర్ – రామ్ చరణ్ రంగంలోకి దిగారు. [more]
కరోనా వ్యాప్తి చెందకుండా.. మనల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకోవడానికి, కరోనా పై ఉన్న భయాలను ప్రారదోలడానికి.. RRR హీరోలైన ఎన్టీఆర్ – రామ్ చరణ్ రంగంలోకి దిగారు. [more]
కరోనా వ్యాప్తి చెందకుండా.. మనల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకోవడానికి, కరోనా పై ఉన్న భయాలను ప్రారదోలడానికి.. RRR హీరోలైన ఎన్టీఆర్ – రామ్ చరణ్ రంగంలోకి దిగారు. ఎన్టీఆర్ – రామ్ చరణ్ కరోనాపై ఓ స్పెషల్ వీడియో చేసి యూట్యూబ్ లో వదిలారు. WHO చెప్పిన 6 సూత్రాలు పాటిస్తే కరోనా అరికట్టవచ్చంటున్నారు.
ఆ వీడియో లో రామ్ చరణ్ – ఎన్టీఆర్ లు మట్లాడుతూ..
రామ్ చరణ్:.. WHO సూచించిన ఈ ఆరు సూత్రాలు పాటిస్తే కోవిడ్ 19 నుండి మనం చాలా సులువుగా బయటపడగలం.
ఎన్టీఆర్: చేతులు సబ్బుతో.. మోచేతి వరకు శుభ్రం గా కడుక్కోండి. గోళ్ళ సందుల్లో కూడా. బయటికి వెళ్ళొచ్చినప్పుడో .. లేదా భోజనానికి ముందో.. ఇలా రోజుకి 7 నుండి 8 సార్లు సబ్బుతో చేతులు కడుక్కోండి.
రామ్ చరణ్: కరోనా వైరస్ తగ్గేవరకూ తెలిసినవాళ్ళు ఎదురు పడితే.. హగ్ చేసుకోవడం, షేక్ హ్యాండ్ ఇవ్వడం మానెయ్యాలి. అనవసరంగా కళ్ళు రుద్దుకోవడం, ముక్కు తుడుచుకోవడం, నోట్లో వేళ్ళు పెట్టుకోవడం కూడా మానెయ్యాలి.
ఎన్టీఆర్: పొడి దగ్గు, జ్వరం, జలుబు ఉందనిపిస్తేనే మాస్క్ లు వేసుకోవాలి, ఇవి లేకుండా వేసుకుంటే.. అనవసరంగా కోవిడ్ 19 మీకంటుకునే ప్రమాదముంది. ఇంకో ముఖ్యమైన విషయం తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు అరచేతిలో కాకుండా.. మోచేతిని అడ్డుపెట్టుకోవాలి.
రామ్ చరణ్: మనుషులు ఎక్కువగా ఉండేచోటికి వెళ్ళకండి, మంచి నీళ్లు ఎక్కువ తాగండి. గడగడా అని ఒకేసారితాగే కన్నా.. ఎక్కువసార్లు కొద్దీ కొద్దిగా సిప్ చెయ్యండి. వేడి నీళ్ళైతే ఇంకా మంచిది.
ఎన్టీఆర్: వాట్స్ అప్ లో వచ్చే ప్రతి వార్తని నమ్మేయ్యకండి. దానిలో నిజమెంతుందో తెలియకుండా ఫార్వర్డ్ చెయ్యకండి. అనవసరంగా పానిక్ సిట్యువేషన్ క్రియేట్ అవుతుంది. ఇది వైరస్ కన్నా ప్రమాదం. WHO వెబ్సైటు లో వచ్చే సూచనలు ఫాలో అవ్వండి.
రామ్ చరణ్:కోవిడ్ 19 మీద గవర్మెంట్ ఇచ్చే సలహాలు, సూచనలు తప్పకుండా పాటిద్దాం మనల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకుందాం.
అంటూ ప్రజలని చైతన్య వంతులను చేస్తూ.. కరోనా అరికట్టే సూత్రాలను వివరించారు ఈ RRR హీరోలు.