Mon Dec 23 2024 15:27:10 GMT+0000 (Coordinated Universal Time)
ఎన్టీఆర్ ని ఆ పాటలో చూసి ఏడ్చేశా : ఒలీవియా మోరిస్
తాజాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించిన ఒలీవియా మోరిస్ తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమా చూశానని తెలిపింది.
హైదరాబాద్ : దర్శకుడు రాజమౌళి.. ఎన్టీఆర్- చరణ్ లు హీరోలుగా రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది. సెలబ్రిటీల నుంచి సామాన్య ప్రేక్షకుల వరకూ, సినీ విమర్శకులచే ప్రశంసలు అందుకుంటోంది. తాజాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించిన ఒలీవియా మోరిస్ తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమా చూశానని తెలిపింది. ఓ తెలుగు ఛానల్ కి ఇచ్చిన ఆన్లైన్ ఇంటర్వ్యూలో ఒలీవియా మాట్లాడుతూ.. సినిమా విడుదలైన మొదటి రోజే యూకేలో తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి సినిమా చూసినట్లు వెల్లడించింది.
సినిమాలో కొమురం భీముడో పాటలో తారక్ నటనకు తాను ఫిదా అయ్యానన్న ఒలీవియా.. ఆ పాటలో తారక్ ను చూస్తే కన్నీళ్లొచ్చాయని తెలిపింది. అలాగే మరికొన్ని సన్నివేశాల్లోనూ భావోద్వేగానికి గురైనట్లు చెప్పింది. ఎన్టీఆర్ అద్భుతమైన వ్యక్తి, సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అంటూ ప్రశంసల జల్లు కురిపించింది. ఈ సినిమాలో నాటు నాటు పాట బాగా నచ్చింది, ఈ పాటకు నా బాయ్ఫ్రెండ్ డ్యాన్స్ ట్రై చేస్తున్నాడని తెలిపింది. అలాగే రాజమౌళి అద్భుతమైన డైరెక్టర్ అని కొనియాడింది.
Next Story