Mon Dec 23 2024 19:42:13 GMT+0000 (Coordinated Universal Time)
RRR 10 రోజుల కలెక్షన్లలివే.. అందరి దృష్టి దానిపైనే !
బాలీవుడ్ లో ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే.. 494.20 కోట్ల షేర్ ను వసూలు చేసింది.
హైదరాబాద్ : రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మాణంలో రూపొందిన సినిమా RRR. మార్చి 25న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లు రాబడుతోంది. తొలివారం విజయవంతంగా ప్రదర్శించబడిన RRR సినిమా.. రెండో వారం కూడా థియేటర్లలో ఆడుతోంది. కలెక్షన్ల విషయానికొస్తే.. తెలుగు రాష్ట్రాల్లోనే RRR సినిమా రూ.232.19 కోట్ల షేర్ రాబట్టింది. ఒక్క నైజామ్ లోనే 10 రోజుల్లో రూ.97 కోట్ల షేర్ వసూలు చేయడం విశేషం.
బాలీవుడ్ లో ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే.. 494.20 కోట్ల షేర్ ను వసూలు చేసింది. మొత్తం మీద RRR సినిమా రూ.750 కోట్ల షేర్ రాబట్టడం విశేషం. చాలా వేగంగా అధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా RRR ప్రశంసలందుకుంటోంది. ఇప్పుడు అందరి దృష్టి రూ.1000 కోట్ల మార్క్ పైనే ఉంది. మరి ఆ మార్క్ ను చేరుతుందో లేదో తెలియాలంటే.. మరికొద్ది రోజులు ఆగాల్సిందే.
Next Story