Mon Dec 23 2024 16:29:06 GMT+0000 (Coordinated Universal Time)
బాలీవుడ్ లో రూ.100కోట్లను కొల్లగొట్టిన RRR
తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన RRR.. బాలీవుడ్ లో ఐదు రోజులకు గాను
హైదరాబాద్ : భారీ అంచనాల నడుమ మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన RRR ఘన విజయాన్ని అందుకుంది. మూడ్రోజుల్లోనే రూ.500 కోట్లను వసూలు చేసి.. రికార్డు సృష్టించింది. తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన RRR.. బాలీవుడ్ లో ఐదు రోజులకు గాను రూ.107 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. RRRపై బాలీవుడ్ నుంచి చాలా విమర్శలొచ్చాయి. అయినా అక్కడ రూ.100 కోట్లకు పైగా వసూలు చేసిందంటే.. మామూలు విషయం కాదు. ఇక లాంగ్ రన్ లో ఈ సినిమా రూ.200 కోట్లు వసూలు చేయవచ్చని అంటున్నారు సినీ విశ్లేషకులు.
తారక్-చరణ్ ప్రధాన పాత్రల్లో.. అజయ్ దేవగణ్, శ్రియా, అలియా భట్, ఒలీవియా మోరిస్, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించిన RRR రూ.1000 కోట్ల దిశగా అడుగులు వేస్తోంది. తొలి ఐదు రోజుల్లో ఆర్ఆర్ఆర్ సినిమా రూ.600 కోట్లు కలెక్షన్లు రాబట్టింది. చరిత్రకు కల్పిత కథని జోడించడంతో.. తర్వాత ఏం జరుగుతుందోనని సినిమా చూసే ప్రేక్షకుడిలో ఆసక్తి రేపుతుంది. ఇక ఈ సినిమాలో పలు సన్నివేశాల్లో ప్రేక్షకులు భావోద్వేగానికి గురవుతున్నారు. అలాగే కొన్ని ఫైట్ సీన్లు ఆకర్షణగా నిలిచాయి.
Next Story