Mon Dec 23 2024 14:38:07 GMT+0000 (Coordinated Universal Time)
RRR మూవీకి జేమ్స్ కామేరూన్ ప్రశంస
RRR మూవీ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామేరూన్ కు ఎంతో నచ్చిందన్నారు రాజమౌళి
RRR మూవీకి అంతర్జాతీయ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. అమెరికాలో పర్యటిస్తున్న రాజమౌళి, కీరవాణిలను హాలీవుడ్ ప్రముఖులు అభినందిస్తున్నారు. RRR మూవీ ఆస్కార్ బరిలోనూ పోటీ పడుతుంది. అయితే ఈ చిత్రాన్ని జేమ్స్ కామేరూన్ చూశారని చిత్ర దర్శకుడు రాజమౌళి ట్వీట్ చేశారు.
రాజమౌళి ట్వీట్....
RRR మూవీ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామేరూన్ కు ఎంతో నచ్చిందన్నారు రాజమౌళి. ఆయన తన భార్యతో కలసి రెండోసారి ఈ చిత్రాన్ని చూశారని రాజమౌళి ట్వీట్ చేశారు. పది నిమిషాల పాటు తన చిత్రాన్ని విశ్లేషించడం నమ్మలేకపోతున్నామని RRR మూవీ దర్శకుడు రాజమౌళి పేర్కొన్నారు.
Next Story