Mon Dec 23 2024 05:24:20 GMT+0000 (Coordinated Universal Time)
తెలుగు రాష్ట్రాల్లో RRR రీ రిలీజ్
విదేశాల్లోనూ వసూళ్లలో కొత్త రికార్డులు సృష్టించిన ఈ సినిమా ఇప్పుడు.. ఆస్కార్ కోసం ఎదురు చూస్తోంది. దర్శకుడు రాజమౌళి..
రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమాను.. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఆదరించారు. భారత్ తో పాటు.. విదేశాల్లోనూ వసూళ్లలో కొత్త రికార్డులు సృష్టించిన ఈ సినిమా ఇప్పుడు.. ఆస్కార్ కోసం ఎదురు చూస్తోంది. దర్శకుడు రాజమౌళి, హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్, కీరవాణి తదితరులంతా ప్రస్తుతం అమెరికాలోనే ఉన్నారు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ కు 20కి పైగా అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. ఆస్కార్ అవార్డుల వేడుకకు మరికొద్దిరోజుల సమయమే ఉన్న నేపథ్యంలో.. తెలుగు రాష్ట్రాల్లో RRRను రీ రిలీజ్ చేయబోతున్నారు.
సినిమా రీ రిలీజ్ కోసం అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. మార్చి 10న తెలుగు రాష్ట్రాల్లో RRRను రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. చిత్రబృందం అధికారిక పోస్టర్ ను విడుదల చేసింది. దేశభక్తి నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా గురించి.. అందరూ ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు. అల్లూరి - కొమరమ్ భీమ్ ల ఆశయాన్ని.. దేశం కోసం వారు చేసిన త్యాగాన్ని ఆవిష్కరించిన సినిమా ఇది. అన్ని సినిమాలు విడుదలైన 10 -15 ఏళ్లకు రిలీజ్ అవుతుంటే.. RRR మాత్రం ఏడాదిలోపే రీ రిలీజ్ అవుతుండటం విశేషం. ఈ సినిమా రీ రిలీజ్ లో ఎలాంటి వసూళ్లు రాబడుతుందో చూడాలి.
Next Story