Mon Dec 23 2024 12:05:31 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాన్స్ కు భారీ షాక్ - ఆర్ఆర్ఆర్ విడుదల వాయిదా !
ఇటీవల చెన్నైలో జరిగిన ఈవెంట్లో కూడా ఆర్ఆర్ఆర్ సినిమాను ఖచ్చితంగా జనవరి 7వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించింది చిత్ర బృందం. కానీ
అభిమానులకు భారీ షాక్ తగిలింది. ఈ ఏడాది జనవరి 7వ తేదీన విడుదల కావాల్సిన ఆర్ఆర్ఆర్ విడుదల వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఓ వైపు కరోనా కేసులు, మరోవైపు కొన్ని రాష్ట్రాల్లో థియేటర్లు మూసివేత, మరికొన్ని రాష్ట్రాల్లో 50 శాతం ఆక్యుపెన్సీ ఆంక్షలు.. ఇటు ఏపీలో సినిమా టికెట్ల రేట్లు తగ్గింపు తదితర కారణాలతో సినిమా విడుదలను మేకర్స్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్న అభిమానులు ఈ వార్త రాగానే నిరాశకు గురయ్యారు. ఇప్పటి వరకూ నాలుగు సార్లు సినిమా విడుదల తేదీలను ప్రకటించగా.. నాలుగు సార్లూ విడుదల వాయిదా పడింది. 2021 దసరాకే విడుదల కావాల్సిన ఆర్ఆర్ఆర్.. అప్పుడు కూడా కరోనా కారణంగానే విడుదల వాయిదా వేసుకుంది.
ఇటీవల చెన్నైలో జరిగిన ఈవెంట్లో కూడా ఆర్ఆర్ఆర్ సినిమాను ఖచ్చితంగా జనవరి 7వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించింది చిత్ర బృందం. కానీ దేశంలో, ప్రపంచ దేశాల్లోనూ పెరుగుతున్న కోవిడ్, ఒమిక్రాన్ కేసుల దృష్ట్యా సినిమా విడుదలను వాయిదా వేసే అవకాశాలెక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆర్ఆర్ఆర్ బృందం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. వరుస అప్ డేట్లు, ఈవెంట్లతో ఆర్ఆర్ఆర్ బృందం సినిమా పై భారీ హైప్స్ క్రియేట్ చేసింది. ఒక్కో సందర్భంలో ఒక్కొక్క పాటను విడుదల చేస్తూ వచ్చిన మేకర్స్.. న్యూ ఇయర్ సందర్భంగా రైజ్ ఆఫ్ రామ్ పేరుతో మరో పాటను విడుదల చేశారు. భారీ మల్టీ స్టారర్ తో.. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అని అభిమానులు ఎదురుచూస్తున్న తరుణంలో.. ఈ వార్త భారీ నిరాశనే మిగిల్చింది.
Also Read : తెలంగాణాలోనూ రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు
Next Story