Mon Dec 23 2024 18:32:11 GMT+0000 (Coordinated Universal Time)
కుంభస్థలాన్ని బద్దలు కొడుతోన్న RRR.. సెకండ్ డే కలెక్షన్స్ ఎంతంటే ?
భారత్ లోనే కాకుండా.. విదేశాల్లోనూ RRR వీకెండ్ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రెండవ రోజు (శనివారం) RRR ప్రపంచ వ్యాప్తంగా..
హైదరాబాద్ : చరణ్ - తారక్ కాంబోలో వచ్చిన RRR సినిమా ప్రపంచ వ్యాప్తంగా విజయవంతంగా ప్రదర్శింపబడుతూ.. కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.223 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిన RRR.. రెండవరోజూ హవా కొనసాగించింది. భారత్ లోనే కాకుండా.. విదేశాల్లోనూ RRR వీకెండ్ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రెండవ రోజు (శనివారం) RRR ప్రపంచ వ్యాప్తంగా 130 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మొత్తంమీద రెండ్రోజుల్లో 350 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ చేసింది.
RRR ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.451 కోట్లు జరగింది. తొలిరోజు నార్త్ లో కాస్త డల్ గా ఉన్న RRR వసూళ్లు.. పాజిటివ్ టాక్ తో రెండోరోజు కలెక్షన్స్ అమాంతం పెరిగాయి. మొదటిరోజు నార్త్ లో రూ.22 కోట్లు రాగా.. రెండోరోజు రూ.50 కోట్లు వసూలయ్యాయి. ఆదివారం RRR కలెక్షన్స్ మరింత ఎక్కువే రావొచ్చన్న అంచనా ఉంది. అదే జరిగితే మరో రెండు, మూడ్రోజుల్లో RRR బ్రేక్ ఈవెన్ చేయవచ్చని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.
Next Story