#RRR మొదలయ్యేది ఎప్పుడంటే...!
రాజమౌళి - రామ్ చరణ్ - రామారావు(జూనియర్ ఎన్టీఆర్) #RRR మల్టీస్టారర్ సినిమా హడావిడి స్టార్ట్ అయ్యింది. మార్చిలోనే డీవీవీ దానయ్య నిర్మాతగా... RRR అంటూ మోషన్ పోస్టర్ తో హడావిడి చేసి సైలెంట్ అయిన రాజమౌళి బ్యాచ్ ఇప్పుడు ఈనెల మొదటి వారంలో సినిమాని ప్రారంభించి మరింత హడావిడి చెయ్యడానికి రెడి అవుతుంది. గత ఆరు నెలలుగా ఈ సినిమాపై రాని వార్త అంటూ లేదు. రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ అన్న పదమే సెన్సేషన్ సృష్టించింది. ఇక ఈ సినిమా మొదలవుతుంది అంటే అభిమానులు ఆగుతారా... కేవలం అభిమానులే కాదు రాజమౌళి చెయ్యబోయే సినిమా కోసం సినీ ప్రేక్షక లోకమంతా ఎదురు చూస్తుంది. మరి రాజమౌళికి ఉన్న క్రేజ్ అలాంటిది.
శుభ ముహూర్తం వచ్చేసింది...
ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని స్టార్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎంతగా ఎదురు చూసారో తెలియదు కానీ వారి అభిమానులు మాత్రం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. మరి ఆ శుభ ముహూర్తానికి డేట్ వచ్చేసింది. దానయ్య నిర్మాణంలో భారీ ప్రాజెక్ట్ గా తెరకెక్కబోయే ఈ బిగ్ మల్టీస్టారర్ రేపు 11వ తారీఖున 11 గంటలకు మొదలవ్వబోతుంది. ఈ విషయాన్ని మేకర్స్ చిన్నపాటి టీజర్ తో తెలియజేసారు. ఆ టీజర్ లో 11వ నెల 11వ తారీఖు ఉదయం 11 గంటలకు RRR సినిమా మొదలవ్వబోతుందని చెప్పడమే కాదు.. ఆ 11.11.11 ని RRR గా మార్చారు చూశారూ అద్భుతః అన్న రీతిలో ఉంది. అసలే సెన్సేషనల్ డైరెక్టర్.. అందునా ఇద్దరు స్టార్ హీరోలు...మరి సినిమా మొదలవుతుంది అంటే దాని సందడి ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్ అభిమానులు సంబరాలు చేసుకోవడానికి రెడీ అయిపోతున్నారు.