Tue Nov 05 2024 10:27:50 GMT+0000 (Coordinated Universal Time)
ఆస్కార్ నామినేషన్ కు ఎంపికైన RRR నాటు నాటు పాట
ఆస్కార్ నామినేషన్లలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్స్ కేటగిరీలో 15 పాటలను ఎంపిక చేసినట్లు ఆస్కార్ పేర్కొంది. వాటిలోనే మన నాటు..
ఒక్క అడుగు.. చరిత్ర సృష్టించేందుకు ఒకే ఒక్క అడుగు దూరంలో నిలిచింది RRR. సినీ ప్రియులు ఎంత ఉత్కంఠగా ఎదురు చూసిన ఆస్కార్ తుది నామినేషన్ల లిస్ట్ వచ్చేసింది. ఈ లిస్టులో RRR నాటు నాటు పాట నిలిచింది. ఇప్పుడు యావత్ భారత ప్రేక్షకుల దృష్టంతా దీనిపైనే ఉంది. నాటు నాటు పాటకు ఆస్కార్ లభిస్తే.. దేశంలోనే కొత్త చరిత్ర సృష్టిస్తుంది తెలుగు సినిమా. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఇటీవలే ఈ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది.
ఈ పాటను చంద్రబోస్ రచించగా.. కీరవాణి స్వరపరిచారు. కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ పాటను ఆలపించారు. కాగా.. ఆస్కార్ నామినేషన్లలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్స్ కేటగిరీలో 15 పాటలను ఎంపిక చేసినట్లు ఆస్కార్ పేర్కొంది. వాటిలోనే మన నాటు నాటు పాట కూడా ఒకటి. మార్తి 23, 2023న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఇప్పటి నుండి ఏ పాటకు గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నది అంచనా వేయడం మొదలవుతుంది.
భారత్ నుండి "చెల్లో షో" (ద లాస్ట్ ఫిల్మ్ షో) బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కేటగిరీలో షార్ట్ లిస్ట్ అయింది. అలాగే బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ కేటగిరీలో ఆల్ ద బ్రీత్స్, బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ద ఎలిఫాంట్ విష్పర్స్ సినిమాలు షార్ట్ లిస్ట్ అయ్యాయి.
Next Story