Mon Dec 23 2024 11:02:13 GMT+0000 (Coordinated Universal Time)
ఆర్ఆర్ఆర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. మే 20 నుంచి స్ట్రీమింగ్
మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ప్రధాన భారతీయ భాషల్లో విడుదలైన ఈ సినిమా.. రూ.1100 కోట్లకు పైగా
హైదరాబాద్ : దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ ఆర్ఆర్ఆర్. మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ప్రధాన భారతీయ భాషల్లో విడుదలైన ఈ సినిమా.. రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు చేసి.. సరికొత్త రికార్డులను సృష్టించింది. హిందీలో రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన సౌత్ ఇండియా సినిమాగా నిలిచింది. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమురం భీమ్ గా జూనియర్ ఎన్టీఆర్ నటించగా.. అలియా భట్, ఒలీవియా మోరిస్ లు వారి సరసన కనిపించారు. అజయ్ దేవ్ గన్, శ్రియ, సముద్రఖని, రాహుల్ రామకృష్ణలు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం తారక్-చరణ్ ల అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.
ఎట్టకేలకు ఆర్ఆర్ఆర్ సినిమా ఓటీటీ విడుదలకు ముహూర్తం ఖరారయింది. మే 20వ తేదీ నుంచి జీ5 లో ఆర్ఆర్ఆర్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమ్ అవనుంది. అయితే.. హిందీ వర్షన్ ను ఎందులో విడుదల చేస్తారన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. ఇప్పటి వరకూ ఉన్న సమాచారం ప్రకారం.. నెట్ ఫ్లిక్స్ హిందీ ఆర్ఆర్ఆర్ హక్కులను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేస్తారని టాక్. ఇక ఓటీటీ ప్రేక్షకులకు పండగే.
Next Story