Tue Nov 05 2024 16:50:02 GMT+0000 (Coordinated Universal Time)
ఓటీటీలోకి RRR.. ఎప్పుడు ? ఎందులో వస్తుంది ?
RRR ఓటీటీలోకి ఎప్పుడొస్తుంది ? ఏ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది ? డిజిటల్ హక్కులను ఎవరు కొనుగోలు చేశారు?
హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా నిన్న విడుదలైన RRR ప్రభంజనం సృష్టిస్తోంది. తొలిరోజు ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే రూ.120కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.257 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. RRR గత సినిమాల రికార్డును చెరిపేసి.. కొత్త రికార్డులను సృష్టిస్తోంది. బాహుబలి, పుష్ప, వకీల్ సాబ్, భీమ్లా నాయక్ తదితర సినిమాల తొలిరోజు కలెక్షన్లింటినీ బద్దలు కొట్టింది. కాగా.. సినిమా థియేటర్లో విడుదలై రెండ్రోజులైనా కాకుండానే.. అప్పుడే ఓటీటీ విడుదలపై చర్చ మొదలైంది.
RRR ఓటీటీలోకి ఎప్పుడొస్తుంది ? ఏ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది ? డిజిటల్ హక్కులను ఎవరు కొనుగోలు చేశారు? అంటూ చర్చ జరుగుతోంది. అయితే.. RRR ఇప్పట్లో ఓటీటీలోకి వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. మూడు నెలల తర్వాతే RRR ఓటీటీలో విడుదలవుతుందని నెట్టింట్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. వాస్తవానికి సినిమాను విడుదలైన మూడు నెలలకు గానీ ఓటీటీలోకి తీసుకురాబోమని దర్శక దిగ్గజం రాజమౌళి ఇంతకుముందే చెప్పకనే చెప్పారు. జూన్ తర్వాతే RRR ఓటీటీలోకి వస్తుందని టాక్.
RRR తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ వెర్షన్ల హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 భారీ ధరకు సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక హిందీ వెర్షన్ హక్కులను నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని అంటున్నారు. మరి, RRRను బుల్లితెరపై చూడాలంటే మరో మూడు నెలలు ఆగాల్సిందే.
Next Story