ఆ దర్శకుడితో ద్వేషం కన్నా… స్నేహం బెటర్ అంటున్న జక్కన్న
టాలీవుడ్ దర్శకుల్లో పాన్ ఇండియా మూవీ తో పిచ్చ పాపులర్ అయిన రాజమౌళి కి నచ్చే దర్శకుడుగా అంటే… ఆ దర్శకుడు ఎంతగా పాపులరో అయ్యుంటాడో అనేది [more]
టాలీవుడ్ దర్శకుల్లో పాన్ ఇండియా మూవీ తో పిచ్చ పాపులర్ అయిన రాజమౌళి కి నచ్చే దర్శకుడుగా అంటే… ఆ దర్శకుడు ఎంతగా పాపులరో అయ్యుంటాడో అనేది [more]
టాలీవుడ్ దర్శకుల్లో పాన్ ఇండియా మూవీ తో పిచ్చ పాపులర్ అయిన రాజమౌళి కి నచ్చే దర్శకుడుగా అంటే… ఆ దర్శకుడు ఎంతగా పాపులరో అయ్యుంటాడో అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే ప్రస్తుతం రాజమౌళిని తలదన్నే దర్శకుల్లో త్రివిక్రమ్ ,సుకుమార్ లాంటి దర్శకులున్నప్పటికీ.. వారు పాన్ ఇండియా మూవీస్ తో పాపులర్ కానీ దర్శకులే. ఇక అపార మేథాశక్తి, సినిమాని ఓ రేంజ్ లో చెక్కే జక్కన్నకు మెచ్చే దర్శకుడుగా అంటే.. అతనికేదో స్పెషల్ ఉండే ఉంటుంది. అతనెవరో కాదు రంగస్థలం దర్శకుడు సుకుమార్ అంటే రాజమౌళి కి పిచ్చ ఇష్టమట. అది కూడా ఆర్య సినిమాప్పటినుండేనట.
కాకపోతే సుకుమార్ సినిమాల్లోని కొన్ని సీన్స్ తియ్యాలంటే ఎప్పటికి తన వల్ల కాదంటున్నాడు ఈ టాప్ మోస్ట్ డైరెక్టర్ రాజమౌళి. ఎప్పటికప్పుడు ఓపెన్ గానే సుకుమార్ అంటే ఇష్టమని చెప్పే రాజమౌళి.. సుకుమార్ ని అంతలా ఇష్టపడానికి కారణం ఆర్య సినిమా చూసాక…. ఈ దర్శకుడెవరో నాకు పోటీగా తయారయ్యేలా ఉన్నాడనిపించిందని… తర్వాత సుకుమార్ విషయంలో నా ముందు రెండే రెండు ఆప్షన్స్ కనబడ్డాయని, అందులో ఒకటి సుకుమార్ ని ద్వేషించడం, రెండోది ప్రేమించడం. అయితే ఓ దర్శకుడ్ని ద్వేషిస్తూ పని చెయ్యడం కన్నా.. ఫ్రెండ్ షిప్ చేస్తూ ఉంటే.. మనసు ప్రశ్నతగా ఉంటుందని నమ్మి సుకుమార్ తో ఫ్రెండ్ షిప్ చేస్తున్నా అని చెప్పిన రాజమౌళి.. సుకుమార్ తెరకెక్కించిన వన్ నేనొక్కడినే సినిమా టీజర్ లోని మహేష్ మీద సుకుమార్ తీసిన షాట్ లాంటి షాట్ నేనెప్పటికీ తియ్యలేనని, ఆ షాట్ ని సుకూంర్ ఎలా తీశాడో అంటూ ఎప్పుడూ ఆలోచిస్తా అంటూ సుకుమార్ తో తనకున్న స్నేహాన్ని ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు రాజమౌళి.