Mon Dec 23 2024 07:52:55 GMT+0000 (Coordinated Universal Time)
RRR ఖాతాలోకి మరో అవార్డు.. SFCS నుండి బెస్ట్ యాక్షన్ కొరియోగ్రఫీ
హాలీవుడ్ చిత్రాలైన అవతార్ 2, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ అట్ వన్స్, ది నార్త్ మెన్, టాప్ గప్ : మ్యావరిక్..
టాలీవుడ్ జక్కన్న.. దర్శకుడు రాజమౌళి.. ఎన్టీఆర్ - రామ్ చరణ్ లు హీరోలుగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా RRR. ఈ సినిమా విడుదలై 10 నెలలైనా.. ఇంకా దాని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. టాలీవుడ్ సినిమాల్లో గతంలో ఏ సినిమాకి రాని అవార్డులను సొంతం చేసుకుంటూ.. అవార్డుల చరిత్ర సృష్టిస్తోంది. బెస్ట్ డైరెక్టర్ గా రాజమౌళి.. న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డు అందుకోగా.. ఇటీవలే.. నాటు నాటు పాటకు ఎంఎం కీరవాణి గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకున్నారు.
ఇప్పుడు మరో కేటగిరీలో RRR అవార్డును అందుకుంది. సియాటెల్ ఫిలిం క్రిటిక్స్ సొసైటీ అవార్డ్స్ లో బెస్ట్ యాక్షన్ కొరియోగ్రఫీ కేటగిరీలో అవార్డు దక్కించుకుంది. హాలీవుడ్ చిత్రాలైన అవతార్ 2, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ అట్ వన్స్, ది నార్త్ మెన్, టాప్ గప్ : మ్యావరిక్ వంటి సినిమాలతో పోటీ పడి.. RRR ఈ అవార్డును దక్కించుకోవడం విశేషం. ఈ విషయాన్ని సదసు సొసైటీ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. కాగా.. RRRకు విక్కీ అరోరా, ఇవాన్ కోస్టాడినోవ్, నిక్ పావెల్, రాయిచో వాసిలెవ్ లు.. స్టంట్స్ కో ఆర్డినేటర్లుగా పనిచేయగా.. ప్రేమ్ రక్షిత్, దినేశ్ కృష్ణన్ స్టంట్స్ కొరియోగ్రఫీ చేశారు.
Next Story