Mon Dec 23 2024 10:31:37 GMT+0000 (Coordinated Universal Time)
RRR ఖాతాలోకి మరో రెండు విదేశీ అవార్డులు
పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా.. అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రం విశేషంగా గుర్తింపు తెచ్చుకుంది.
రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు హీరోలుగా.. బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన సినిమా RRR. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా.. అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రం విశేషంగా గుర్తింపు తెచ్చుకుంది. అనేక ప్రపంచస్థాయి అవార్డులు అందుకున్న ఆర్ఆర్ఆర్... ప్రతిష్ఠాత్మక ఆస్కార్ రేసులోనూ నిలిచింది. ప్రతిష్టాత్మకంగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డు, గోల్డెన్ టొమాటో అవార్డులను సైతం అవతార్ ను వెనక్కి నెట్టి మరీ సొంతం చేసుకుంది.
తాజాగా RRR ఖాతాలోకి మరో రెండు విదేశీ అవార్డులు వరించాయి. హూస్టన్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ అవార్డుల్లో ఆర్ఆర్ఆర్ ఉత్తమ విదేశీ చిత్రంగా నిలిచింది. ఈ అవార్డుల్లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ పురస్కారం కూడా ఈ చిత్రానికే దక్కింది. ఇప్పటికే ఆస్కార్ బరిలో ఉన్న నాటు నాటు పాట హూస్టన్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీని కూడా ఆకట్టుకుంది. ఈ అవార్డులతో కలిపి RRR మొత్తం 18 అంతర్జాతీయ అవార్డులను అందుకుంది. ఇప్పుడు అందరి దృష్టి.. మార్చి 13న జరగనున్న ఆస్కార్ అవార్డుల కార్యక్రమంపైనే ఉంది. నాటు నాటు పాటకు ఆస్కార్ వస్తుందని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు.
Next Story