Mon Dec 23 2024 10:41:38 GMT+0000 (Coordinated Universal Time)
గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న RRR
ఈ అవార్డ్స్ ఫంక్షన్ నేడు నిర్వహించగా.. RRRసినిమాలో నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డు పొంది..
రాజమౌళి దర్శకత్వంలో.. రామ్ చరణ్ - ఎన్టీఆర్ లు హీరోలుగా తెరకెక్కిన భారీ మల్టీస్టారర్ సినిమా RRR. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏ రేంజ్ లో విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకూ.. RRR సినిమాపై ప్రశంసలు కురిపించారు. RRRకు వరుసగా అవార్డులొస్తున్నాయి. ఇంటర్నేషనల్ లెవల్ లో అనేక అవార్డులు అందుకున్న RRR.. తాజాగా మరో ప్రతిష్టాత్మక అవార్డును తన సొంతం చేసుకుంది.
ఆస్కార్ తర్వాత.. హాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో ఇటీవల RRR నామినేట్ అయింది. ఈ అవార్డ్స్ ఫంక్షన్ నేడు నిర్వహించగా.. RRRసినిమాలో నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డు పొంది.. కొత్త చరిత్రను సృష్టించింది. బుధవారం కాలిఫోర్నియాలోని ది బెవర్లీ హిల్టన్ హాలులో జరిగిన ఈ వేడుకకు రాజమౌళి, రమ, ఎన్టీఆర్, రామ్ చరణ్, ఎంఎం కీరవాణిలు కుటుంబ సమేతంగా హాజరవ్వగా.. కీరవాణి అవార్డును అందుకున్నారు. అభిమానులు, సినీ ప్రియులు కీరవాణికి, RRR చిత్రయూనిట్ కి అభినందనలు తెలుపుతున్నారు.
ఇండియా నుండి గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న రెండో వ్యక్తిగా కీరవాణి నిలిచారు. తొలిసారి AR రెహమాన్ స్లమ్ డాగ్ మిలినియర్ సినిమాకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్నారు. అయితే.. గోల్డెన్ గ్లోబ్ అవార్డునందుకున్న తొలి తెలుగు వ్యక్తిగా కీరవాణి, తొలి తెలుగు పాటగా నాటు నాటు, తొలితెలుగు సినిమాగా RRR చరిత్ర సృష్టించింది. ఈ పాటను చంద్రబోస్ రచించగా.. కీరవాణి స్వరపరిచారు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాటకు.. రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ స్టెప్పులతో దుమ్ములేపేశారు. కాగా.. ఆస్కార్ బరిలోనూ..RRR ఈ పాటతోనే పోటీ పడుతోంది.
Next Story