Mon Dec 23 2024 15:03:49 GMT+0000 (Coordinated Universal Time)
2022 ఫ్యాన్ ఫేవరెట్ మూవీగా RRRకు గోల్డెన్ టొమాటో అవార్డు
హాలీవుడ్ కు చెందిన ఈ రాటెన్ టొమాటోస్ వెబ్ సైట్ ప్రతి సినిమాకు ప్రేక్షకుల రేటింగ్ ఇస్తుంటుంది. అలాగే ప్రతి ఏటా మంచి..
ప్రముఖ దర్శక దిగ్గజం రాజమౌళి ఎపిక్ డ్రామాగా తీసిన ఆర్ఆర్ఆర్ సినిమా.. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పింది. బాహుబలిని మించిన క్రేజ్ ను ఆర్ఆర్ఆర్ సొంతం చేసుకుంది. హాలీవుడ్ లో అవతార్ 2 ను వెనక్కి నెట్టి ఇప్పటికే పలు అవార్డులను అందుకున్న ఆర్ఆర్ఆర్.. ఇప్పుడు మరో అంతర్జాతీయ అవార్డును తన ఖాతాలో వేసుకుంది. వరుస అవార్డులతో దూసుకెళ్తోన్న ఆర్ఆర్ఆర్ కు గోల్డెన్ టొమాటో అవార్డు దక్కింది. పాపులర్ రివ్యూ అగ్రిగేటర్ వెబ్సైట్ 'రాటెన్ టొమాటోస్' 2022 సంవత్సరానికి గోల్డెన్ టొమాటో అవార్డులను ప్రకటించింది. ఇందులో 2022 ఫ్యాన్ ఫేవరెట్ మూవీగా 'ఆర్ఆర్ఆర్' అవార్డు గెలుచుకుంది. ఈ విషయాన్ని తన అధికారక సోషల్ మీడియా ప్రొఫైల్ల ద్వారా రాటెన్ టొమాటోస్ ప్రకటించింది.
హాలీవుడ్ కు చెందిన ఈ రాటెన్ టొమాటోస్ వెబ్ సైట్ ప్రతి సినిమాకు ప్రేక్షకుల రేటింగ్ ఇస్తుంటుంది. అలాగే ప్రతి ఏటా మంచి సినిమాలకు గోల్డెన్ టొమాటో అవార్డులను ప్రకటిస్తుంది. అలా 2022 ఫ్యాన్ ఫేవరెట్ మూవీ అవార్డు మన ఆర్ఆర్ఆర్ కు వచ్చింది. ఫ్యాన్ ఫేవరెట్ మూవీల్లో రెండో స్థానంలో టాప్ గన్, మూడో స్థానంలో ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆట్ ఎట్ వన్స్, నాల్గో స్థానంలో ద బ్యాట్ మ్యాన్ ఉండగా.. గతేడాది చివరిలో విడుదలై బాక్సాఫీస్ దుమ్ముదులిపిన అవతార్ 2 ఐదవ స్థానంతో సరిపెట్టుకుంది. ఇప్పటివరకూ గోల్డెన్ గ్లోబ్ అవార్డు సహా.. 17 అవార్డులను అందుకున్న ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ కోసం తెలుగు సినీ అభిమానులతో పాటు యావత్ దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.
Next Story