Mon Dec 23 2024 11:08:29 GMT+0000 (Coordinated Universal Time)
RRR ఖాతాలోకి మరో ప్రతిష్టాత్మక అవార్డు.. అవతార్ 2ను సైతం వెనక్కి నెట్టి..
తాజాగా మరో ప్రతిష్టాత్మక అవార్డుకు RRR ఎంపికైంది. జపాన్ 46వ అకాడమీ అవార్డుల్లో విదేశీ చిత్రాల విభాగంలో అవుట్ స్టాండింగ్..
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత ఎస్ఎస్ రాజమౌళికి దక్కుతోంది. ఇప్పటికే 15 అంతర్జాతీయ అవార్డులు అందుకున్న RRR ఇప్పుడు ఆస్కార్ అవార్డు కోసం.. హాలీవుడ్ సినిమాలతో పోటీ పడుతోంది. తాజాగా మరో ప్రతిష్టాత్మక అవార్డుకు RRR ఎంపికైంది. జపాన్ 46వ అకాడమీ అవార్డుల్లో విదేశీ చిత్రాల విభాగంలో అవుట్ స్టాండింగ్ ఫిల్మ్ పురస్కారానికి ఆర్ఆర్ఆర్ ఎంపికైంది. ఈ అవార్డు కోసం రేసులో జేమ్స్ కామెరాన్ అద్భుతసృష్టి అవతార్-2 ఉన్నప్పటికీ, ఆర్ఆర్ఆర్ విజేతగా నిలవడం విశేషం.
ఇటీవలే నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకుంది ఆర్ఆర్ఆర్. దాంతో.. ఆస్కార్ కు ఈ అవార్డు శుభసూచకమైంది. అంతకుముందు.. ఎస్ఎస్ రాజమౌళి ఫిలిం క్రిటిక్ అవార్డును కూడా అందుకున్నారు. కాగా.. నేడు ఆస్కార్ తుది నామినేషన్లను ప్రకటించనున్న నేపథ్యంలో.. ఆర్ఆర్ఆర్ బరిలో నిలుస్తుందా లేదా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇటీవల జపాన్ లో జాపనీస్ భాషలో విడుదలైన ఆర్ఆర్ఆర్ కు అక్కడి ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
Next Story