Mon Dec 23 2024 16:03:07 GMT+0000 (Coordinated Universal Time)
RRR సక్సెస్ పార్టీ.. నాటు నాటు పాటకు స్టెప్పులేసిన జక్కన్న
RRR నైజాం ఏరియా డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు తీసుకున్నారు. నైజాంలో ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టడంతో
హైదరాబాద్ : జూనియర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన విజువల్ వండర్ RRR మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సినిమా విడుదలైన 10 రోజుల్లోనే రూ.750 కోట్లు వసూలు చేసింది. రెండో వారం కూడా సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుండటంతో.. ఈ సినిమా రూ.1000 కోట్ల మార్క్ ను తాకుతుందని అంచనా. ఇప్పుడు అందరి దృష్టి దానిపైనే ఉంది.
RRR నైజాం ఏరియా డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు తీసుకున్నారు. నైజాంలో ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టడంతో దిల్ రాజు ట్రిపుల్ ఆర్ టీమ్ కు సక్సెస్ పార్టీ ఇచ్చారు. హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ లో ఈ పార్టీ జరగింది. దర్శకులు రాజమౌళి, అనిల్ రావిపూడి, హీరోలు తారక్ - చరణ్ లతో పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఈ పార్టీకి హాజరయ్యారు. పార్టీలో ఎన్టీఆర్ నాటు నాటు సాంగ్ పాడగా.. అనిల్ రావిపూడి, రాజమౌళి స్టెప్పులేశారు. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Next Story