Mon Dec 23 2024 15:32:25 GMT+0000 (Coordinated Universal Time)
ఆర్ఆర్ఆర్ నుంచి 'ఎత్తర జెండా' విడుదల వాయిదా
తాజాగా ఈ సినిమా నుంచి 'ఎత్తర జెండా' పాటను మార్చి 14న విడుదల చేయనున్నట్లు ఆర్ఆర్ఆర్ టీమ్ ప్రకటించింది. కానీ.. పాట విడుదల కాలేదు.
హైదరాబాద్ : భారీ తారాగణం, భారీ బడ్జెట్ తో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి 'ఎత్తర జెండా' పాటను మార్చి 14న విడుదల చేయనున్నట్లు ఆర్ఆర్ఆర్ టీమ్ ప్రకటించింది. కానీ.. పాట విడుదల కాలేదు. కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా ఎత్తర జెండా పాటను నేడు విడుదల చేయలేకపోతున్నామంటూ ఆర్ఆర్ఆర్ చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టయిన్ మెంట్ వెల్లడించింది.
'ఎత్తర జెండా' పాటను మార్చి 15(రేపు) ఉదయం 10 గంటలకు విడుదల చేస్తామని ట్విట్టర్లో తెలిపింది. ఇటీవలే ఈ పాటకు సంబంధించిన ప్రోమో రాగా.. దానికి అభిమానుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. కాగా.. దర్శకుడు రాజమౌళి, నిర్మాత డీవీవీ దానయ్య సీఎం జగన్ ను ఆయన నివాసంలో కలిశారు. మరో 10 రోజుల్లో ఆర్ఆర్ఆర్ విడుదల కానుండగా.. ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
Next Story