Sat Nov 23 2024 00:14:26 GMT+0000 (Coordinated Universal Time)
15 కేటగిరీల్లో ఆస్కార్కు వెళ్లే ప్రయత్నం చేస్తోన్న RRR..
పాన్ ఇండియా వైడ్ గా విడుదలై రూ. 1000 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన సినిమా RRR. ఈ సినిమా ఆస్కార్ నామినేషన్స్ కు వెళ్తుందని
తెలుగు సినిమాని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి. తాజాగా ఆయన దర్శకత్వంలో రూపొంది.. పాన్ ఇండియా వైడ్ గా విడుదలై రూ. 1000 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన సినిమా RRR. ఈ సినిమా ఆస్కార్ నామినేషన్స్ కు వెళ్తుందని అంతా భావించారు. కానీ RRRను కాదని గుజరాతీ సినిమా చెల్లో షో ని ఆస్కార్ కు పంపుతున్నట్లు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధికారికంగా ప్రకటించింది. దాంతో చాలామంది సినీ ప్రియులు నిరాశ చెందారు. తాజాగా RRRను నేరుగా ఆస్కార్ నామినేషన్లకు పంపేందుకు చిత్రయూనిట్ ప్రయత్నిస్తోంది. ఏయే కేటగిరీల్లో RRR ఆస్కార్కు ప్రయత్నిస్తుందో చూద్దాం.
1. బెస్ట్ మోషన్ పిక్చర్
2. బెస్ట్ డైరెక్టర్ - రాజమౌళి
3. బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే
4. బెస్ట్ యాక్టర్ : జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్
5. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ : అజయ్ దేవగణ్
6. బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్: అలియా భట్
7. బెస్ట్ సినిమాటోగ్రఫీ : కేకే సెంథిల్ కుమార్
8. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ : నాటు నాటు
9. బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ : సాబు సిరిల్
10. బెస్ట్ ఒరిజినల్ స్కోర్ : ఎంఎం కీరవాణి
11. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ : రమా రాజమౌళి
12. బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్
13. బెస్ట్ మేకప్, హెయిర్ స్టైలింగ్ : నల్ల శ్రీను, సేనాపతి నాయుడు
14. బెస్ట్ సౌండ్ : (రఘునాథ్ కామిశెట్టి, బోలోయ్ కుమార్ డోలోయి, రాహుల్ కార్పే)
15. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ : వి. శ్రీనివాస్ మోహన్
ఆస్కార్ కు డైరెక్ట్ గా వెళ్లేందుకు చేస్తున్న RRRచిత్ర యూనిట్ ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో చూడాలి.
Next Story