Mon Dec 23 2024 15:11:39 GMT+0000 (Coordinated Universal Time)
స్వర్ణదేవాలయంలో RRR టీమ్ !
తారక్, చరణ్, రాజమౌళి దేశమంతా తిరుగుతూ.. ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు.
అమృత్ సర్ : భారీ బడ్జెట్ తో, భారీ తారాగణంతో తెరకెక్కిన RRR సినిమా మార్చి 25న ఐదు భారతీయ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా టీమ్ ప్రమోషన్స్ ను వేగవంతం చేశాయి. తారక్, చరణ్, రాజమౌళిలో దేశమంతా తిరుగుతూ.. ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. నిన్న బరోడా, ఢిల్లీల్లో RRR ప్రమోషనల్ ఈవెంట్ లో పాల్గొన్నారు. తాజాగా పంజాబ్ కు చేరుకున్న RRRటీమ్.. అక్కడి ఫేమస్ టెంపుల్ లో ఆశీర్వాదం తీసుకున్నారు.
అమృత్ సర్ లో ఉన్న గోల్డెన్ టెంపుల్ ను తారక్, చరణ్, రాజమౌళి సందర్శించారు. ఈ ముగ్గురు RRR ప్రింట్‌తో ఉన్న తెల్లటి కుర్తా పైజామా ధరించి ఆలయానికి వెళ్లారు. అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. నేడు జైపూర్ లో మరో రెండు ఈవెంట్లలో ఈ ముగ్గురూ పాల్గొననున్నారు.
Next Story