Mon Dec 23 2024 10:37:32 GMT+0000 (Coordinated Universal Time)
ఉక్కుమనిషితో ఆర్ఆర్ఆర్ టీమ్.. కెవాడియాలో చెర్రీ, తారక్ సందడి
తాజాగా రాజమౌళి, చరణ్, తారక్ లు గుజరాత్ లో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కెవాడియాకు విచ్చేసిన వీరు..
కెవాడియా : పాన్ ఇండియా మోస్ట్ అవైటెడ్ సినిమా ఆర్ఆర్ఆర్. ఎక్కడ చూసినా.. ఎవరి నోట విన్నా ఈ సినిమా గురించే వినిపిస్తోంది. సినిమా ఎప్పుడు విడుదలవుతుందో.. తమ అభిమాన హీరోలను బిగ్ స్క్రీన్ పై ఎప్పుడెప్పుడు చూస్తామా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రూ.400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు అన్ని అడ్డంకులు తొలగి తుది ముహూర్తం ఖరారైంది. మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ విడుదల కానుంది.
సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో.. చిత్రబృందం ప్రమోషన్లను వేగవంతం చేశారు. నిన్న కర్ణాటకలోని చిక్కబల్లాపూర్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. తాజాగా రాజమౌళి, చరణ్, తారక్ లు గుజరాత్ లో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కెవాడియాకు విచ్చేసిన వీరు.. సర్దార్ సరోవర్ డ్యామ్ వద్ద కొలువుదీరిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ(ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయి పటేల్ ) ని సందర్శించారు. వీరి రాకతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. మీడియా ప్రతినిధులు పెద్దసంఖ్యలో రాగా.. మీడియా మిత్రులడిగిన ప్రశ్నలకు వారు సమాధానాలిచ్చారు.
Next Story