రాజమౌళి అలా చేస్తున్నాడా?
ఇప్పుడు సినిమా చిత్రీకరణలకు ప్రభుత్వ అనుమతులు వచ్చేసాయి. అందరూ షూటింగ్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ముందు రాజమౌళి పని మొదలెడితే.. మిగతా వాళ్ళు రంగంలోకి దిగడానికి ఎదురు [more]
ఇప్పుడు సినిమా చిత్రీకరణలకు ప్రభుత్వ అనుమతులు వచ్చేసాయి. అందరూ షూటింగ్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ముందు రాజమౌళి పని మొదలెడితే.. మిగతా వాళ్ళు రంగంలోకి దిగడానికి ఎదురు [more]
ఇప్పుడు సినిమా చిత్రీకరణలకు ప్రభుత్వ అనుమతులు వచ్చేసాయి. అందరూ షూటింగ్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ముందు రాజమౌళి పని మొదలెడితే.. మిగతా వాళ్ళు రంగంలోకి దిగడానికి ఎదురు చూసున్నారు. అయితే రాజమౌళి RRR కోసం ట్రయిల్ షూట్ మొదలెట్టబోతున్నాడు. అంతకన్నా ముందే RRR టీం తో ఆన్ లైన్ లో మీటింగ్ పెట్టాడట. రాజమౌళి ఈ మీటింగ్ లో సినిమా బడ్జెట్, రెమ్యూనరేషన్స్ వంటి విషయాలతో పాటు.. కరోనా వైరస్ నుండి తీసుకోవలసిన జాగ్రత్తలు వంటి అనేక విషయాలు తన RRR టీం తో చర్చించినట్లు తెలుస్తుంది.
ఇక ట్రయిల్ షూట్ లో ప్రభుత్వ నిబంధనల మేరకు కేవలం 50 మంది టీం తోనే షూటింగ్ చేయబోతున్నాడట రాజమౌళి. అంత తక్కువమందితో సినిమా షూటింగ్ సాధ్యమేనా అనేది రాజమౌళి ట్రయిల్ షూట్ తో తేలిపోతుంది. ఈ ట్రయిల్ షూట్ ని గండిపేటలో అల్యూమినియం ఫ్యాక్టరీలో సాబు సిరిల్ నేతృత్వంలో స్పెషల్ గా వేసిన సెట్ లో ఈ షూట్ జరుగుతుంది అని చెబుతున్నారు. ఇంతకుముందు రాజమౌళి RRR కోసం అద్భుతమైన లొకేషన్స్ నార్త్ ఇండియాలో ఎంపిక చేసి ఉంచారు. ఈ వైరస్ రీత్యా అక్కడికి వెళ్లి షూటింగ్ జరపలేని పరిస్థితి ఏర్పడింది. అందుకే ఇక్కడ హైదరాబాద్ లోనే ప్రత్యేకమైన సెట్స్ లో పనికానిచ్చేస్తున్నారట.