Mon Dec 23 2024 11:03:27 GMT+0000 (Coordinated Universal Time)
RRRకు మరో ప్రెస్టీజియస్ అవార్డు.. ఆస్కార్ కూడా ఖాయమా ?
మార్చి నెలలో విడుదలైన ఈ సినిమా, ఓటీటీలో, బుల్లితెరలోనూ ప్రసారమైనా.. ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు. ఆస్కార్ రేసులో..
దర్శకధీరుడు రాజమౌళి భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన పాన్ ఇండియా సినిమా RRRగతంలో ఏ తెలుగు సినిమాకి రానన్ని ప్రెస్టీజియస్ అవార్డులను సొంతం చేసుకుంటోంది. మార్చి నెలలో విడుదలైన ఈ సినిమా, ఓటీటీలో, బుల్లితెరలోనూ ప్రసారమైనా.. ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు. ఆస్కార్ రేసులో ఉన్న ఈ సినిమా..తాజాగా మరో విలువైన అవార్డును దక్కించుకుంది. ప్రెస్టీజియస్ HCA స్పాట్లైట్ విన్నర్ అవార్డు దక్కింది. ఈ మేరకు HCA(హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్) తన సోషల్ మీడియా అకౌంట్లో ఈ అవార్డుకు సంబంధించిన వివరాలను పోస్ట్ చేసింది.
తమకు ఈ ప్రెస్టీజియస్ అవార్డు రావడంపై ఆర్ఆర్ఆర్ టీమ్ సంతోషం వ్యక్తం చేసింది. RRR సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఆదరిస్తున్న వారందరికీ చిత్రయూనిట్ ధన్యవాదాలు పేర్కొంది. ఇక HCA స్పాట్లైట్ విన్నర్ అవార్డులను 2023 ఫిబ్రవరి 24న ప్రదానం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇటీవలే దర్శకుడు రాజమౌళికి న్యూయార్క్ ఫిలిం సిటీ సర్కిల్స్ అవార్డుల్లో బెస్ట్ డైరెక్టర్ అవార్డు లభించింది.
Next Story