Mon Dec 23 2024 02:08:26 GMT+0000 (Coordinated Universal Time)
గర్జిస్తున్న పులిలా రామరాజు.. ఆర్ఆర్ఆర్ నుంచి మరో పోస్టర్
ఆర్ఆర్ఆర్. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో దర్శకుడు రాజమౌళి మూవీ ప్రమోషన్స్ పై దృష్టి పెట్టారు.
నందమూరి తారక రామారావు (జూ.ఎన్టీఆర్), రామ్ చరణ్ తేజ్ లు కొమురం భీమ్, రామరాజు పాత్రల్లో.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ఆర్ఆర్ఆర్. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో జక్కన్న మూవీ ప్రమోషన్స్ పై దృష్టి పెట్టారు. ప్రమోషన్స్ లో భాగంగా ఈ రోజు ఉదయం ఎన్టీఆర్ పోస్టర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సాయంత్రం 4 గంటలకు సినిమాలో రామ్ చరణ్ పోస్టర్ ను విడుదల చేశారు చెర్రీ. ముందు విడుదలైన పోస్టర్ లో ఎన్టీఆర్ దెబ్బతిన్న సింహం లా ఉంటే.. రామ్ చరణ్ గర్జిస్తున్న మన్యం పులిలా కనిపిస్తున్నారు.
రెండు పోస్టర్లు...
ఈ రెండు పోస్టర్లు సినిమాపై అంచనాలను కాస్త పెంచాయి. వీటిని బట్టి చూస్తుంటే.. ఆర్ఆర్ఆర్ లో జక్కన్న యాక్షన్ సీన్లను వీర లెవల్ లో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. ఈ నెల 3వ తేదీనే అది విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల ఈ నెల 9వ తేదీకి వాయిదా పడింది. జనవరి 7, 2022వ తేదీన సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. కాగా.. ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలు విడుదలయ్యాయి. ఆర్ఆర్ఆర్ కు కీరవాణి సంగీత బాణీలు సమకూర్చుతున్నారు.
Next Story