Fri Dec 27 2024 07:36:49 GMT+0000 (Coordinated Universal Time)
RRR అభిమానులకు షాక్?
రాజమౌళి ఇచ్చే RRR అప్ డేట్ పై ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు ఆసక్తిగా కాదు.. ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రాజమౌళి RRR సినిమా విషయాలేమి బయటికి [more]
రాజమౌళి ఇచ్చే RRR అప్ డేట్ పై ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు ఆసక్తిగా కాదు.. ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రాజమౌళి RRR సినిమా విషయాలేమి బయటికి [more]
రాజమౌళి ఇచ్చే RRR అప్ డేట్ పై ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు ఆసక్తిగా కాదు.. ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రాజమౌళి RRR సినిమా విషయాలేమి బయటికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకోవడం మరీ ఎక్కువైంది. పాన్ ఇండియా మూవీ గా RRR ని ప్రకటించడం.. సినిమా జులై 30 2020 లో విడుదలకు డేట్ ఫిక్స్ చెయ్యడంతో.. ఈ ఏడాది తమ అభిమాన హీరోల సినిమాని చూడొచ్చని ఫాన్స్ పిచ్చగా ఎదురు చూస్తున్నారు కానీ రాజమౌళి మాత్రం ఆచితూచి సినిమాని చిత్రీకరిస్తున్నారు. అయితే RRR అప్ డేట్ అంటూ సంక్రాతి హడావిడి ఉంటుందని ఆశపడిన వారికీ జక్కన్న సైలెంట్ అవడంతో ఉసూరుమన్నారు. ఇక జక్కన సంక్రాంతికి విడుదలైన బడా సినిమాలపై ఒక్క ట్వీట్ కూడా వెయ్యకుండా కామ్ గా ఉండడంతో.. ఎన్టీఆర్, చరణ్ అభిమానులకు RRR విషయంలో ఏం జరుగుతుందో తెలియక అయోమయంలో ఉన్నారు.
ఈలోపు బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ RRR రిలీజ్ డేట్ జులై 30 నుండి మారినా మారొచ్చని ట్వీట్ చెయ్యడంతో.. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తయిందని చెబుతున్న RRR సినిమా విషయంలో ఏదో జరుగుతుందని అభిమానులు ఫిక్స్ అవుతున్నారు. తరుణ్ ఆదర్శ్ చెప్పాడు అంటే…. ఖచ్చితంగా RRR వాయిదా పడడం పక్క అంటున్నారు. అందులోను మత్తువదలరా ఈవెంట్ లో RRR విషయాల అడగొద్దు అంటూ జక్కన్న క్లారిటీ ఇవ్వడం, తరుణ్ ఆదర్శ్ ట్వీట్ తో RRR వాయిదా కన్ఫర్మ్ అయ్యింది. అయితే 2020 దసరా కి ఈ సినిమా విడుదలయ్యే ఛాన్సెస్ ఉన్నట్లుగా నేషనల్ మీడియా టాక్.
- Tags
- rrr
Next Story