Tue Nov 05 2024 10:38:03 GMT+0000 (Coordinated Universal Time)
బెస్ట్ యాక్టర్ అవార్డు కోసం పోటీ పడుతున్న రామ్ చరణ్, ఎన్టీఆర్
సినిమా విడుదలైన ఏడాది కాలంలోనే.. RRR 20కి పైగా అవార్డులను అందుకుంది. ఇంకా మరిన్ని అవార్డులను అందుకునే పనిలో ఉంది.
RRR.. ఈ సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో చాటిచూపించాడు దర్శకుడు రాజమౌళి. పాన్ ఇండియా సినిమాలు చాలానే ఉన్నా.. RRR కి వాటన్నింటినీ మించిన క్రేజ్ ఏర్పడింది. ఇప్పటికే పలు దేశాల్లో RRR షో లు పడుతున్నాయంటే మామూలు విషయం కాదు. సినిమా విడుదలై ఏడాది కావస్తోంది. ఓటీటీలోనూ సినిమా వచ్చేసింది. అయినా సరే.. థియేటర్లే సినిమా చూస్తే ఆ కిక్కే వేరంటున్నారు మెగా, నందమూరి అభిమానులు. ఇప్పటికిప్పుడు RRRని రీ రిలీజ్ చేసినా.. మళ్లీ కోట్లలో వసూళ్లు సాధించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
సినిమా విడుదలైన ఏడాది కాలంలోనే.. RRR 20కి పైగా అవార్డులను అందుకుంది. ఇంకా మరిన్ని అవార్డులను అందుకునే పనిలో ఉంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక అవార్డులను అందుకుంటూ సరికొత్త చరిత్రను సృష్టిస్తోంది. ఆస్కార్ కు ఒకే ఒక్క అడుగు దూరంలో ఉంది RRR. ఇప్పటి వరకూ దర్శకుడు, సంగీత దర్శకుడు, సినిమా పరంగా అవార్డులు రాగా.. ఇప్పుడు బెస్ట్ యాక్టర్ అవార్డు కోసం చరణ్, తారక్ లు పోటీ పడుతున్నారు. నిజానికి కొమురం భీముడో పాటలో ఎన్టీఆర్ నటనకు ఆస్కార్ వస్తుందని అభిమానులు ఆశించారు కానీ వీలుకాలేదు.
ఇప్పుడు ఓ అంతర్జాతీయ అవార్డుల సంస్థ బెస్ట్ యాక్టర్స్ నామినీలను ప్రకటించింది. హాలీవుడ్ లో నిర్వహించే క్రిటిక్స్ ఛాయిస్ సూపర్ అవార్డ్స్ లో యాక్షన్ మూవీ కేటగరీలో బెస్ట్ యాక్టర్స్ నామినీలను ప్రకటించారు. ఈ అవార్డు కోసం ఐదుగురు పోటీ పడుతుండగా.. వారిలో ఇద్దరు ఎన్టీఆర్, రామ్ చరణ్. వీరిద్దరినీ RRR సినిమా నుండి బెస్ట్ యాక్టర్ నామినీలుగా ఎంపిక చేశారు. అలాగే హాలీవుడ్ నటులు నికోలస్ కేజ్, టామ్ క్రూయిజ్, బ్రాడ్ పిట్ లు కూడా పోటీలో ఉన్నారు. ఈ అవార్డులలో RRR బెస్ట్ మూవీ కేటగిరీలోనూ పోటీ పడుతోంది. బెస్ట్ యాక్టర్ అవార్డు ఎవరు అందుకుంటారో తెలియాలంటే.. మార్చి 16 వరకూ ఆగాల్సిందే.
Next Story