Tue Dec 24 2024 03:08:24 GMT+0000 (Coordinated Universal Time)
సింగర్ సునీత తల్లి కాబోతోందంటూ వార్తలు.. మీకో దండంరా నాయనా !
ప్రముఖ టాలీవుడ్ సింగర్ సునీత ఇటీవలే వ్యాపారవేత్త రామ్ వీరపనేనిని పెళ్లాడిన విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత చాలా హ్యాపీగా..
హైదరాబాద్ : సెలబ్రిటీలు ఏ చిన్న పోస్ట్ పెట్టినా.. అందులో చాటంత బాగోతాన్ని చూపించడం పరిపాటిగా మారింది. ప్రముఖ టాలీవుడ్ సింగర్ సునీత ఇటీవలే వ్యాపారవేత్త రామ్ వీరపనేనిని పెళ్లాడిన విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత చాలా హ్యాపీగా ఉన్నట్లు పలు సందర్భాల్లో సునీత చెప్పుకొచ్చారు. తాజాగా ఆమె ఓ ఫొటోను షేర్ చేస్తూ Blessed అని రాశారు. అంతే.. సింగర్ సునీత తల్లి కాబోతోందంటూ వార్తలొచ్చేశాయ్. సోషల్ మీడియాలో ఈ వార్త విపరీతంగా వైరల్ కావడంతో.. సునీత స్పందించారు.
తాను మామిడి కాయను పట్టుకుని దిగిన ఫొటోను ఇన్ స్టాలో పోస్ట్ చేస్తే.. దానికి తల్లిని కాబోతున్నానంటూ వార్తలు రాయడంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు మరో పోస్ట్ పెట్టారు. మామిడి తోటలో మొదటి మామిడికాయ కాచిందని ఫొటో పెడితే.. ఇలా వార్తలు రాస్తున్నారంటూ అసహనం చెందారు. ఇలాంటి ఫేక్ న్యూస్ రాయడం ఆపాలని సూచించారు. ఇలాంటి రూమర్లు స్ప్రెడ్ చేస్తున్న వాళ్లందరికీ దండంరా నాయనా ! అని ఆ పోస్ట్ కింద రాసుకొచ్చారు సునీత.
Next Story