Mon Dec 23 2024 16:22:36 GMT+0000 (Coordinated Universal Time)
మరోసారి తెరపైకి నిహారిక-చైతన్యల విడాకుల వార్తలు.. నిజమేంటి ?
రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లోని ఒబెరాయ్ ఉదయ్ విలాస్‌లో మెగా, అల్లు ఫ్యామిలీలతో పాటు ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖుల..
ఇటీవల కాలంలో పెళ్లిళ్లు గ్రాండ్ గా చేసుకోవడం.. కొన్నాళ్లకే విడాకులు తీసుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. పెళ్లి అనేది ఒక పవిత్రమైన బంధం. పెళ్లినాట ఒకరికొకరు కష్టసుఖాలన్నింటిలోనూ తోడుంటామని చేసుకున్న ప్రమాణాలను వదిలేసి.. మనస్పర్థలతో విడిపోతున్నారు. ఇటీవల చాలామంది సెలబ్రిటీల జీవితాల్లో ఇది షరా మామూలైపోయింది. ముఖ్యంగా మెగావారింట విడాకుల పర్వాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కొణిదెల కల్యాణ్ దేవ్ ను రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. చాలాకాలంగా వీరిద్దరూ దూరంగా ఉన్నారని, విడాకులు తీసుకున్నారని టాక్ ఎప్పటినుండో వినిపిస్తోంది. కానీ ఇప్పటికీ ఈ విషయంపై మెగా ఫ్యామిలీ స్పందించలేదు.
తాజాగా నాగబాబు కూతురు నిహారిక కూడా.. చైతన్యతో విడిపోయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. మెగా డాటర్ నిహారిక కొణిదెల, జొన్నలగడ్డ వెంకట చైతన్య 2020 డిసెంబర్ 9న వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లోని ఒబెరాయ్ ఉదయ్ విలాస్‌లో మెగా, అల్లు ఫ్యామిలీలతో పాటు ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖుల మధ్య అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. వీరిద్దరి జంట చూడముచ్చటగా ఉందని మెగా అభిమానులంతా తెగ సంబరపడ్డారు. కానీ.. పెళ్లైన ఏడాదిన్నరకే వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారన్న వార్తలు వినిపించాయి. నిహారికాని ట్యాగ్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ లో చైతన్య ఒక పోస్ట్ వేయడంతో అవి నిజం కాదని తేలిపోయింది.
తాజాగా.. వీరిద్దరూ ఇన్ స్టాగ్రామ్ లో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడమే కాకుండా.. చైతన్య తన ఇన్ స్టా ఖాతాలో నుంచి నిహారికతో పెళ్లి ఫొటోలు, ఇద్దరూ కలిసి తీసుకున్న ఫొటోలన్నింటినీ డిలీట్ చేశాడు. చైతన్య మెగా ఫ్యామిలీలో అందర్నీ ఫాలో అవుతూ, కేవలం నిహారికను మాత్రమే అన్‌ఫాలో కొట్టాడు. దీంతో వీరిద్దరూ విడిపోతున్నారు అనే వార్తలు మళ్ళీ చర్చకు వచ్చాయి. మరి వీరిద్దరూ నిజంగానే విడిపోతున్నారా? లేదా? అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఏదేమైనా మెగావారింట ఇలా వరుసగా విడాకులు జరుగుతుండటం అభిమానులను కలవరపెడుతోంది.
Next Story