సాయి పల్లవిపై పగబట్టిన నిర్మాత?
అసలు ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ మీద రానన్ని నెగెటివ్ న్యూస్ లు హీరోయిన్ సాయి పల్లవి మీద వస్తున్నాయి. ఫిదా చిత్రం అప్పుడు ఎటువంటి నెగెటివ్ న్యూస్ సాయి పల్లవి మీద వినబడలేదు. కానీ ఆమె రెండో సినిమా ఎంసీఏ దగ్గరనుండి తాజాగా షూటింగ్ స్పాట్ లో ఉన్న పడి పడి లేచే మనసు వరకు సాయి పల్లవిపై నెగెటివ్ న్యూస్ అంటే ఆమె సినిమా సెట్స్ కి టైం కి రాదు, వచ్చినా యాటిట్యుడ్ చూపిస్తుంది, అలాగే ఆమె తరచూ హీరోలతో గొడవపడుతుంది... తనకి నచ్చక పొతే ఎవ్వరిని కేర్ చెయ్యదు.. ఇష్టమైన దర్శకులతో కలిసి హీరోలను ఇబ్బందులు పాలు చేస్తుంది ఇలా ఆమెపై చాలానే వార్తలొచ్చాయి.
అయితే నిజంగానే సాయి పల్లవి వలన హీరో నాగ శౌర్య కణం సినిమా అప్పుడు సాయి పల్లవి డామినేషన్ తట్టుకోలేక ఇబ్బంది పడ్డానని చెప్పడం ఇక సాయి పల్లవిపై ఏ న్యూస్ వచ్చినా నిజమని అందరు నమ్మేశారు. అందుకేనేమో సాయి పల్లవి క్రేజ్ అంతగా నిలబడడం లేదు. ఆమెకి అవకాశాలు కూడా తగ్గుముఖం పట్టినట్లే. అసలు సాయి పల్లవి సినిమాలో ఉంటె సినిమా ఆడేస్తుందని ఫిదా వచ్చిన కొత్తల్లో అన్నారు. కానీ ఇప్పుడు ఇలా. అయితే సాయి పల్లవి మీద ఇలా నెగెటివ్ న్యూస్ లు స్ప్రెడ్ కావడానికి కారణం టాలీవుడ్ లో ఒక బడా నిర్మాత అనే న్యూస్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయ్యింది. మలయాళం నుండి టాలీవుడ్ కి తీసుకొచ్చిన ఆ నిర్మాత ఆమెతో రెండు మూడు సినిమాలు చేయాలనుకున్నాడు.
కానీ సాయి పల్లవి కి అయన సినిమాలో పాత్ర నచ్చక ఆయన సినిమా రిజెక్ట్ చేసిందట. దాంతో మనసులో పెట్టుకున్న ఆ నిర్మాత తన మనుషులతో ఆమె మీద లేనిపోని ప్రచారాలు చేస్తున్నాడని అంటున్నారు. ఇక సాయి పల్లవి కూడా ఈ మధ్యన తనంటే గిట్టని వారు తనపై లేనిపోని ప్రచారం చేస్తున్నారంటూ బాధపడుతుంది. అయితే కొన్ని విషయాల్లో సాయి పల్లవి ది కరెక్ట్ అయినా.. మరికొన్ని విషయాల్లో మాత్రం సాయి పల్లవి పై వస్తున్న వార్తలు నమ్మాల్సిన అవసరం ఉందంటున్నారు. అంతేలే రెండు చేతులు కలిస్తేనేగా చప్పట్లు వచ్చేవి.