అంత ధైర్యం ఉండబట్టే చేశా అంటున్న హీరోయిన్
ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా ఒకే ఒక్క సినిమా విషయంపై హాట్ హాట్ చర్చలు జరుపుతుంది. సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో, ప్రింట్ మీడియాలో, ఫిలింనగర్ సాక్షిగా కూడా ఆ సినిమా ముచ్చట్లే కనబడుతున్నాయి. విడుదలకు ముందు ఎలాంటి అంచనాలు లేని RX 100 సినిమా విడుదలైన రెండు రోజులకు గాని ప్రేక్షకుల మైండ్ లో పడలేదు. ఇక సినిమా విడుదలైన రెండు రోజులు నుండి ఇండస్ట్రీ మొత్తం ఈ సినిమా గురించిన ముచ్చట్లే. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా చిన్నగా ప్రేక్షకుల మైండ్ సెట్ ని మార్చుకుంటూ పోతుంది. ఈ సినిమాలో కార్తికేయ హీరోగా, పాయల్ రాజపుట్ హీరోయిన్ గా చాలా అంటే చాలా బోల్డ్ గా నటించి యూత్ ని కట్టిపడేసారు. ఈ సినిమా డైరెక్ట్ గా యూత్ కి కనెక్ట్ అయ్యే విధంగా ఉండడంతో... ఈ సినిమా కలెక్షన్స్ కూడా మెల్లగా పుంజుకుంటున్నాయి.
అయితే ఈ సినిమాలో ఎలాంటి అదుపు లేకుండా ముద్దు సీన్స్ లోను, నెగెటివ్ షేడ్స్ లోను నటించి అందరి మనసులను దోచేసిన పాయల్ రాజపుట్ మీద ఇప్పుడు అందరి కన్ను పడింది. నెగెటివ్ షేడ్స్ కి, ముద్దు సీన్స్ కి బోల్డ్ సీన్స్ కి పెద్దగా హీరోయిన్స్ ఎవరు దైర్యం చెయ్యరు. కానీ పాయల్ మాత్రం తనకి అన్ని గట్స్, ధైర్యం ఉండబట్టే ఈ సినిమా చేసానని... అలాంటి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చెయ్యాలంటే సాహసం ఉండాలని... అందుకే తాను ఏ మాత్రం భయపడకుండా ఈ సినిమాకు ఓకే చెప్పానని అంటోంది. మరి పాయల్ ధైర్యానికి సరిపడా మార్కులు వచ్చేస్తున్నాయ్. ఈ దెబ్బకి అమ్మడు స్టార్ హీరోల దృష్టిలో పడినా పడొచ్చు. అందుకే ఈ సినిమాకి పాయల్ కేవలం ఆరు లక్షలే ఛార్జ్ చేసిన.. 60 లక్షలకు సరిపడా నటించేసి మెప్పించేసింది.