Mon Dec 23 2024 00:42:46 GMT+0000 (Coordinated Universal Time)
SSMB29 : రాజమౌళి, మహేష్ సినిమా 2025లో స్టార్ట్ అవుతుందా..!
SSMB29 మూవీ వచ్చే ఏడాది మేలో స్టార్ట్ అవుతుందంటూ నిర్మాత చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
SSMB29 : రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో రూపొందబోయే ప్రాజెక్ట్ కోసం నేషనల్ లెవెల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ వరకు ఎంతో ఆసక్తి నెలకుంది. అమెజాన్ అడవుల నేపథ్యంతో అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా.. ఎప్పుడెప్పుడు మొదలవుతుందో అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది వేసవిలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్తుందంటూ మొన్నటివరకు వార్తలు వినిపించాయి.
అయితే ఇప్పుడు తాజాగా ఈ చిత్రం 2025 మేలో సెట్స్ పైకి వెళ్తుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ నిర్మాణంలో సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న 'ఎస్ గోపాల్ రెడ్డి' రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వచ్చే ఏడాది మేలో సినిమా సెట్స్ పైకి వెళ్తుందంటూ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఇది చూసిన ఫ్యాన్స్.. తెగ టెన్షన్ పడిపోతున్నారు.
షూటింగ్ కి వెళ్ళడానికే ఇంత సమయం పడితే, రిలీజ్ కి ఇంకెంత సమయం పడుతుందని ఆందోళన చెందుతున్నారు. అయితే ఫ్యాన్స్ కంగారుపడాల్సిన అవసరం లేదని కొందరు మీడియా వర్గాల వ్యక్తులు చెబుతున్నారు. ఆ ఇంటర్వ్యూ గత ఏడాది 2023 డిసెంబర్లో షూట్ చేశారట. ఆ సమయంలో ఆయన వచ్చే ఏడాది అంటూ 2024 గురించి మాట్లాడారని చెబుతున్నారు. ఆ ఇంటర్వ్యూని ఇప్పుడు టెలికాస్ట్ చేయడంతో కొంచెం తికమక ఏర్పడిందని తెలియజేస్తున్నారు.
Next Story