సందీప్ వంగ బాలీవుడ్ క్రిటిక్స్ ని కడిగేస్తున్నాడు
బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి రీమేక్ గా వచ్చిన ‘కబీర్ సింగ్’ ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందో వేరే చెప్పనవసరంలేదు. క్రిటిక్స్ అయితే ఈసినిమాకి 2కు అటు [more]
బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి రీమేక్ గా వచ్చిన ‘కబీర్ సింగ్’ ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందో వేరే చెప్పనవసరంలేదు. క్రిటిక్స్ అయితే ఈసినిమాకి 2కు అటు [more]
బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి రీమేక్ గా వచ్చిన ‘కబీర్ సింగ్’ ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందో వేరే చెప్పనవసరంలేదు. క్రిటిక్స్ అయితే ఈసినిమాకి 2కు అటు ఇటుగా రేటింగ్స్ ఇచ్చి సినిమా వేస్ట్ అని తేల్చేశారు. కానీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద షాక్ చేస్తుంది. ఈమూవీ తొలి ఐదు రోజుల్లో రూ.100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. అదే జోరు కొనసాగిస్తూ రూ.200 కోట్ల గ్రాస్ క్లబ్బులోనూ అడుగుపెట్టింది. దాంతో బాలీవుడ్ మీడియా మొత్తం షాక్ తిన్నారు. చాలామంది ఈసినిమాను తప్పుబట్టారు. ఇది పురుషాధిక్యాన్ని చాటే సినిమా అని.. మహిళల్ని తక్కువగా చూపించారని విమర్శించారు
అయితే దానికి డైరెక్టర్ సందీప్ వంగ అప్పుడే విమర్శకులకు దీటుగా బదులిచ్చాడు. ఈసినిమాను వ్యతిరేకిస్తున్న వాళ్లు సూడో ఫెమినిస్టులని వారికి ఫెమినిజం అంటే అర్థం తెలియదని వ్యాఖ్యలు చేసాడు. అంతే కాదు సందీప్ అక్కడ బాలీవుడ్లో లెజెండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న రాజీవ్ మసంద్‌ను సైతం అతను వదల్లేదు. ఆయను పేరు పెట్టి మరి ఎక్కిపారేసాడు. ఆయన ‘కబీర్ సింగ్’ కు 2 స్టార్ రేటింగ్ ఇవ్వడాన్ని అతను తప్పుబట్టాడు. అలానే ఇందులో ని సన్నివేశాల గురించి రాజీవ్ దారుణమైన వ్యాఖ్యలు చేయడం ఆయన తప్పుబట్టారు. క్రిటిక్స్ అయితే సినిమాను కించపరిచేలా మాట్లాడతారా? ఆలా మాట్లాడేవారు క్రిటిక్స్ ఏం అవుతారు. అని ఘాటుగానే విమర్శించారు.