వాళ్ళన్నారని కాదుగాని.. సినిమాకో దండమండి!
స్టార్ కిడ్స్ సినిమాలకి చుక్కలు చూపిస్తున్న సుశాంత్ సింగ్ రాజపుట్ అభిమానులు.. ముఖ్యంగా మహేష్ భట్ – అలియా భట్ ల సడక్ 2 సినిమా ట్రైలర్ [more]
స్టార్ కిడ్స్ సినిమాలకి చుక్కలు చూపిస్తున్న సుశాంత్ సింగ్ రాజపుట్ అభిమానులు.. ముఖ్యంగా మహేష్ భట్ – అలియా భట్ ల సడక్ 2 సినిమా ట్రైలర్ [more]
స్టార్ కిడ్స్ సినిమాలకి చుక్కలు చూపిస్తున్న సుశాంత్ సింగ్ రాజపుట్ అభిమానులు.. ముఖ్యంగా మహేష్ భట్ – అలియా భట్ ల సడక్ 2 సినిమా ట్రైలర్ అప్పటినుండి ఆ సినిమా పై కక్ష కట్టారు. అందులోను రియా చక్రవర్తికి క్లోజ్ అయిన మహేష్ భట్ సినిమా అనేసరికి సుశాంత్ సింగ్ అభిమానులకి మరీ పూనకలొచ్చేశాయి. సడక్ 2 ట్రైలర్ కె డిస్ లైక్స్ తో కంగారు పట్టించిన సుశాంత్ అభిమానుల తీరు చాలామంది తప్పుబట్టారు. నిజంగా చెప్పాలంటే అభిమానులు అన్నారని, ఏదో చేశారు కాదు కానీ.. సడక్ 2 సినిమా చూసిన వారు అమ్మో ఈ సినిమా ఏంటి ఈ లోకం ఏంటి అంటారు. ఎందుకంటే సడక్ 2 సినిమా అలా ఉంది. బాలీవుడ్ డిజాస్టర్స్ లో సడక్ 2 నెంబర్ వన్ లో ఉండినా ఉండొచ్చు.
గత అర్ధ రాత్రి హాట్ స్టార్+డిస్నీలో సడక్ 2 ని నేరుగా విడుదల చేసింది టీం. సడక్ 2 ని ఓటిటిలో చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో హాహాకారాలు చేస్తున్నారు. అమ్మో ఈ సినిమా ఏమిటండి ఇలా ఉంది.. అంత చెత్త సినిమా నా లైఫ్ లో చూడలేదు, బాబోయ్ మహేష్ భట్… సినిమాని ఇలా తీసడేమిటి.. అమ్మో సినిమా చూస్తే వాంతులు అవడం ఖాయం అంటూ సోషల్ మీడియాలో సడక్ 2 పై అభిప్రాయాలను వ్యక్తమవుతున్నాయి. దర్శకనిర్మాత మహేష్ భట్ గతంలో సడక్ సినిమాతో సంచాలను సృష్టించి.. ఇప్పడు సడక్ 2 విషయంలో ఇలా చేశాడేమిటో అంటూ బాలీవుడ్ మొత్తం సినిమా గురించే చర్చించుకుంటున్నారు.
సడక్ 2 సినిమా చూసిన రివ్యూ రైటర్స్ అయితే ఈ సినిమాకి 0 రేటింగ్స్ ఇస్తున్నారు. బాలీవుడ్ ఎనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ అయితే ఈ సినిమాకి 1 రేటింగ్ ఇచ్చాడు. సింగిల్ డిజిట్ రేటింగ్ ఇవ్వడమే కాదు.. అన్ బేరబుల్ అటూ పోస్ట్ చేసాడు. ఇక ఈ సినిమాపై సోషల్ మీడియాలో మీమ్స్ కి లెక్కలేదు. మరి నిజంగా సుశాంత్ సింగ్ రాజపుట్ అభిమానులు కత్తి కడితే కట్టారు.. ఓ మంచి సినిమా కిల్ అవుతుంది అనుకుంటే.. సినిమా చూసాక అమ్మ బాబోయ్ సినిమాని మనం చంపేదెమిటి.. అంతలాంటి చెత్త సినిమాని నేనింత వరకు చూడలేదంటున్నారు జనాలు.