వెడ్ నెస్ డే వరెస్ట్ అయిందే
బిగ్గెస్ట్ హిట్ అని చెప్పుకుంటున్న సాహో ఇంకా రాబట్టాల్సింది చాలా ఉంది. ఓపెనింగ్స్, వీకెండ్స్ అన్ని హౌస్ ఫుల్ అయి మంచి కలెక్షన్స్ వస్తున్నాయని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు [more]
బిగ్గెస్ట్ హిట్ అని చెప్పుకుంటున్న సాహో ఇంకా రాబట్టాల్సింది చాలా ఉంది. ఓపెనింగ్స్, వీకెండ్స్ అన్ని హౌస్ ఫుల్ అయి మంచి కలెక్షన్స్ వస్తున్నాయని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు [more]
బిగ్గెస్ట్ హిట్ అని చెప్పుకుంటున్న సాహో ఇంకా రాబట్టాల్సింది చాలా ఉంది. ఓపెనింగ్స్, వీకెండ్స్ అన్ని హౌస్ ఫుల్ అయి మంచి కలెక్షన్స్ వస్తున్నాయని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు కానీ ఈమూవీ ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. ఈ చిత్రం గ్రాస్ రూ.350 కోట్లకు, షేర్ రూ.200 కోట్లకు చేరువగా ఉన్నట్లు చెబుతున్నారు. అంటే బయ్యర్స్ కి మూడింట రెండొంతులు కూడా ఇంకా వెనక్కి రాలేదు. బయ్యర్స్ సేఫ్ అవ్వాలంటే ఈమూవీకి ఇంకా 100 కోట్ల పైనే రావాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితిల్లో అది కష్టమే అనిపిస్తోంది.
హిందీలో మాత్రం…..
హిందీలో మాత్రం ఈ చిత్రం ఇరగాడేస్తుంది. హిందీలో ఈ సినిమాను రూ.65 కోట్లకు అమ్మారు. 5 రోజుల్లో ఈమూవీ అక్కడ రూ.100 కోట్ల గ్రాస్ , షేర్ రూ.60 కోట్లు చేరింది. బుధవారం షోలన్నీ అయ్యేసరికి ఈ చిత్రం హిందీలో బ్రేక్ ఈవెన్ అయినట్లే. గురువారం నుంచి వచ్చేది మొత్తం లాభాలే అంటున్నారు అక్కడ ట్రేడ్ నిపుణులు. తెలుగు రాష్ట్రాల్లో ఈమూవీ సేఫ్ కి వెళ్లాలంటే ఇంకా 60 శాతం పెట్టుబడి వెనక్కి తేవాలి. తమిళనాడు, కేరళ, అమెరికాల్లో పరిస్థితి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కర్ణాటకలో కొంచం పర్వాలేదు. ఈ వీక్ లో పెద్దగా సినిమాలు లేవు కాబట్టి ఏమన్నా పుంజుకుంటుందేమో చూడాలి.