Mon Dec 23 2024 11:20:51 GMT+0000 (Coordinated Universal Time)
హాలీవుడ్ రేంజ్ లో ఉందిగా!
సినిమా రిలీజ్ ఎప్పుడో చెప్పరు కానీ రెండు వీడియో బిట్స్ మాత్రం రిలీజ్ చేసారు. ప్రభాస్ బర్త్డే సందర్భంగా ఒక వీడియో. కొన్ని గంటల కిందట ఇంకో [more]
సినిమా రిలీజ్ ఎప్పుడో చెప్పరు కానీ రెండు వీడియో బిట్స్ మాత్రం రిలీజ్ చేసారు. ప్రభాస్ బర్త్డే సందర్భంగా ఒక వీడియో. కొన్ని గంటల కిందట ఇంకో [more]
సినిమా రిలీజ్ ఎప్పుడో చెప్పరు కానీ రెండు వీడియో బిట్స్ మాత్రం రిలీజ్ చేసారు. ప్రభాస్ బర్త్డే సందర్భంగా ఒక వీడియో. కొన్ని గంటల కిందట ఇంకో వీడియో బిట్ ను రిలీజ్ చేసారు మేకర్స్. శ్రద్ధా కపూర్ పుట్టిన రోజు కానుకగా ఈ వీడియో బిట్ రిలీజ్ చేసారు. షేడ్స్ అఫ్ చాప్టర్ 2 పేరిట ఒక స్పెషల్ వీడియో విడుదల చేసింది.
అయితే చాప్టర్ 1 తో పోలిస్తే అంత లెన్త్ లేకపోవడం అభిమానులకు కొంత నిరాశ కలిగించినప్పటికీ ఉన్న నిమిషంలోనే హాలీవుడ్ రేంజ్ రచ్చ చూపించేయడం విశేషం. ఇందులో ఎక్కడ ప్రభాస్ ని రివీల్ చేసి చేయనట్టు..అలానే ఎక్కడ కథకు సంబంధించిన ఎలాంటి క్లూ లీక్ అవ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కేవలం టెక్నీషియన్స్ వర్క్ మాత్రమే హైలైట్ అయ్యేలా చాలా జాగ్రత్తగా వీడియో ని కట్ చేసారు.
ఇందులో ప్రభాస్ రెండు మూడు చోట్ల కనిపించి కనిపించినట్టు కనిపిస్తాడు. వీడియో చివరిలో శ్రద్ధా కపూర్ గన్ తో పట్టుకుని కనిపిస్తది. వీడియో మొత్తం చాలా రిచ్ గా ఉండడం, హాలీవుడ్ ని మరిపించే స్థాయిలో స్టెంట్స్ ఉండడం ఇలా సినిమా కోసం ఎంత కష్టపడ్డారో ఈ వీడియో చూస్తే అర్ధం అవుతుంది.దాదాపు రెండు వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం ఆగష్టు లో రిలీజ్ చేస్తాం అని చెపుతున్నారు.
Next Story