Mon Dec 23 2024 10:46:10 GMT+0000 (Coordinated Universal Time)
మిస్టిక్ థ్రిల్లర్ గా #SDT15 : పవన్ సినిమాకు పెట్టాలనుకున్న ఆ టైటిల్ ను పెట్టనున్నారా ?
ఇదిలా ఉండగా.. #SDT15 సినిమాకు ‘విరూపాక్ష’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న..
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తోన్న తాజా సినిమా #SDT15 మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా చిత్రబృందం.. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ను డిసెంబర్ 7న విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు విడుదల చేసిన ఓ పోస్టర్ ఆసక్తికరంగా మారింది. ఆ పోస్టర్ పై #NTRForSDT అని ఉంది. దాంతో సాయిధరమ్ తేజ్ సినిమా టైటిల్ గ్లింప్స్ కు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాడని చెప్పకనే చెప్పింది. మరి తేజ్ కోసం ఎన్టీఆర్ చెప్పే ఆ పవర్ఫుల్ డైలాగ్ ఏంటా అని నెట్టింట చర్చ జరుగుతోంది.
ఇదిలా ఉండగా.. #SDT15 సినిమాకు 'విరూపాక్ష' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాకు తొలుత ఈ టైటిల్ నే పెడదామనుకున్నారట. కానీ.. ఆ తర్వాత వీరమల్లు అని ఫిక్స్ చేశారు. దర్శకుడు కార్తిక్ దండు తెరకెక్కిస్తున్న ఈ సినిమా మిస్టిక్ థ్రిల్లర్ నేపథ్యంలో రాబోతున్న తేజ్ సినిమాకు 'విరూపాక్ష' అనే టైటిల్ అయితే ఆడియన్స్ లో క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుందని చిత్రబృందం భావిస్తోందని సమాచారం. నిజంగానే ఈ సినిమాకు ఆ టైటిల్ నే పెడుతున్నారా ? లేదా తెలియాలంటే మరో రెండ్రోజులు ఆగాల్సిందే.
Next Story