విమానాశ్రయంలోనే సాయిధరమ్ తేజ్
తేజ్ ఐ లవ్ యు చిత్రానికి సంభందించిన ప్రమెషన్ లో భాగంగా విశాఖపట్నం నుండి హైదరాబాద్ కి తిరుగుప్రయాణం లో విమానాశ్రయం వద్దకు చేరుకున్నారు సాయిధరమ్ తేజ్.. ఇంతలోనే ఓ పిలుపు అతన్ని పలకరించింది. పాండ్రంగి గ్రామానికి చెందిన బంగారమ్మ అనే యువతి బోన్ క్యాన్సర్ తో బాధపడుతుంది. డాక్టర్ ట్రీట్మెంట్ లో భాగంగా ఓ కాలిని తీసివేశారు. ఇటీవల 10 వ తరగతి లో 8.5 గ్రేడ్ ని సాధించింది. ఆమె పరిస్థితి తెలుసుకున్న పెందుర్తి గ్రామానికి చెందిన రాము అనే యువకుడు ఆమెకి ఆసరాగా నిలబడ్డాడు. అయితే తన అభిమాన హీరో సాయిధరమ్ తేజ్ సిటీ కి రావటంతో తెలుసుకున్న బంగారమ్మ తేజ్ ను కలవాలనుకుంది... ఈ విషయం తెలుసుకున్న సాయిధరమ్ తేజ్ తన అభిమానినే విమానాశ్రయం దగ్గరకి పిలిపించి కలిసారు.. అంతేకాకుండా ఆరోగ్యం ఎలా వుందని అడిగి తెసుసుకున్నాడు. ఆమెకు సహాయ పడుతున్న రాము ని కూడా అభినందించాడు.. బంగారమ్మ ఆరోగ్యం బాగా కుదుటపడాలని మెగా అభిమానులు ప్రార్ధన చేయాలని సాయిధరమ్ తేజ్ కోరారు..