Mon Dec 23 2024 10:56:14 GMT+0000 (Coordinated Universal Time)
జల్సా రీ రిలీజ్ ట్రైలర్ విడుదల చేసిన సాయిధరమ్.. రేపు స్పెషల్ షో లు
ఫ్యాన్స్ కి ఇది పండుగరోజేనని అన్నాడు. పవన్ నటించిన 'జల్సా' సినిమాకి త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడు. 2008లో వచ్చిన..
పవన్ కల్యాణ్ పుట్టినరోజు సమయం దగ్గరకి వచ్చేసింది. సెప్టెంబర్ 2వ తేదీన ఆయన 51వ పుట్టినరోజును జరుపుకోనున్నారు. ప్రతి ఏడాది పవన్ అభిమానులు పవన్ కల్యాణ్ పుట్టినరోజున చేసే హంగామా అంతా ఇంతా కాదు. తమకున్న అభిమానాన్ని రక్తదానాలు, అన్నదానాల రూపంలో చాటుకుంటుంటారు. ఈ ఏడాది పవన్ పుట్టినరోజు సందర్భంగా రెండు సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. థియేటర్లలో జల్సా, తమ్ముడు స్పెషల్ షోస్ వేస్తున్నారు. సెప్టెంబర్ 1న జల్సా ను విడుదల చేస్తుండగా.. సాయిధరమ్ తేజ్ జల్సా రీ రిలీజ్ ట్రైలర్ ను తన సోషల్ మీడియా ద్వారా విడుదల చేశాడు.
పవన్ మావయ్య నుంచి గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్లు రీ రిలీజ్ అవుతున్నందుకు తనకి చాలా ఆనందంగా .. ఉత్సాహంగా ఉందని చెప్పాడు. ఫ్యాన్స్ కి ఇది పండుగరోజేనని అన్నాడు. పవన్ నటించిన 'జల్సా' సినిమాకి త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడు. 2008లో వచ్చిన ఈ సినిమా, బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇక 'తమ్ముడు' సినిమా విషయానికి వస్తే, 1999లో వచ్చిన ఈ సినిమాకి అరుణ్ ప్రసాద్ దర్శకత్వం వహించాడు. పవన్ సినిమాల లిస్ట్ లో ఈ రెండు సినిమాలు ముందుంటాయి. కాగా.. మహేష్ బర్త్ డే స్పెషల్ గా పోకిరి సినిమాను రీ రిలీజ్ చేయగా.. చిరంజీవి బర్త్ డే కి ఘరానా మొగుడు సినిమా స్పెషల్ షోలు వేశారు.
Next Story