Mon Dec 23 2024 10:39:46 GMT+0000 (Coordinated Universal Time)
కాలేజీలో కలర్స్ స్వాతి పేపర్ కాపీ కొట్టి.. పాస్ అయిన సాయి ధరమ్ తేజ్..
హీరోయిన్ కలర్స్ స్వాతి, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా క్లాస్మేట్స్ అని పెద్దగా ఎవరికి తెలియదు. వీరిద్దరూ..
టాలీవుడ్ లో ఇప్పుడు ఉన్న జనరేషన్స్ లోని చాలామంది స్టార్స్ తమ ఎడ్యుకేషన్ లైఫ్ లో కలిసి చదువుకున్నవారే. ఈక్రమంలోనే రామ్ చరణ్, రానా, శర్వానంద్.. అని చెబుతుంటారు. అయితే హీరోయిన్ కలర్స్ స్వాతి (Swathi Reddy), సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కూడా క్లాస్మేట్స్ అని పెద్దగా ఎవరికి తెలియదు. వీరిద్దరూ డిగ్రీ కలిసి చదువుకున్నారు. అయితే వీరి స్నేహం బయట వేదికల పై ఎప్పుడూ పెద్దగా కనిపించలేదు.
తాజాగా స్వాతి నటించిన 'మంత్ అఫ్ మధు' అనే సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి సాయి ధరమ్ తేజ్ ముఖ్య అతిథిగా వచ్చాడు. ఇక ఈ వేదిక పై వీరిద్దరి మధ్య ఎంతటి స్నేహం ఉందో అభిమానులకు తెలియజేశారు. వీరిద్దరూ పేరులు ‘S’తోనే మొదలు అవ్వడంతో క్లాస్ లో స్వాతి వెనుకే సాయి ధరమ్ ఉండేవాడట. ఈక్రమంలోనే ఎగ్జామ్స్, ప్రాక్టికల్స్ టైములో కూడా ఒకరి వెనుక ఒకరు ఉండేవారట.
దీంతో తేజ్ తన పేపర్ చూసే ఎగ్జామ్స్ పాస్ అయ్యేవాడని స్వాతి చెప్పుకుంది. ఇక దీనికి సాయి ధరమ్ రెస్పాండ్ అవుతూ.. "అసలు చూపించేది కాదండి. బాగా ఏడిపించేది. ప్రాక్టీకల్స్ లో కూడా రిజల్ట్ చెప్పమన్నా చెప్పేది కాదు" అంటూ కాలేజీ డేస్ ని అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం వీరిద్దరి కామెంట్స్ కి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారాయి. కాగా సాయి ధరమ్, స్వాతి కలిసి తాజాగా ఒక చిన్న ఫిలింలో నటిస్తున్నారు.
టాలీవుడ్ సీనియర్ నటుడు 'నరేష్' కుమారుడు 'నవీన్' దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్న షార్ట్ ఫీచర్ ఫిలిం 'సత్య' (Satya). ఈ మూవీ మొత్తం డూరేషన్ 23 నిముషాలు పాటు ఉంటుంది. ఇందులో ఒక 6 నిముషాలు సాంగ్ కూడా ఉంటుంది. ఇటీవల ఆ సాంగ్ ని కూడా రిలీజ్ చేశారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసే సైనికులు, వారిని దేశ కోసం పంపించే వాళ్ళ కుటుంబం చేసే త్యాగం గురించి ఆ మూవీలో చూపించబోతున్నారు.
Next Story