Mon Dec 23 2024 15:55:48 GMT+0000 (Coordinated Universal Time)
ఒక ఊరిచుట్టూ తిరిగే కథ.. విరూపాక్ష ట్రైలర్
రెండేళ్లుగా సాయిధరమ్ తేజ్ నుంచి ఒక్కసినిమా కూడా రాలేదు. కొన్ని నెలల క్రితమే ఆయన ఒక రోడ్ యాక్సిడెంట్ లో..
మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ చాలా గ్యాప్ తర్వాత విరూపాక్షగా ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. రిపబ్లిక్ సినిమా తర్వాత.. రెండేళ్లుగా సాయిధరమ్ తేజ్ నుంచి ఒక్కసినిమా కూడా రాలేదు. కొన్ని నెలల క్రితమే ఆయన ఒక రోడ్ యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడి.. చాలా రోజులు ఆస్పత్రిలో , ఇంట్లోనే ఉండి పూర్తిగా రికవర్ అయ్యారు. విరూపాక్షగా గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చేందుకు తేజ్ రెడీ అయ్యాడు. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన విరూపాక్ష నుంచి తాజాగా థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్.
ఒక ఊరు, ఆ ఊరిలో జరిగే హత్యలు.. ఆ హత్యలు ఎందుకు జరుగుతున్నాయి ? ఊరిని అష్టదిగ్భంధనం ఎందుకు చేశారు ? ఆ ఊరిని విరూపాక్షే కాపాడగలడు అని పూజారి ఎందుకు చెప్తాడు ? వంటి ఆసక్తికర సన్నివేశాలతో ట్రైలర్ ను కట్ చేశారు. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కు జోడీగా సంయుక్త మీనన్ నటించింది. సుకుమార్ శిష్యుడైన కార్తీక్ వర్మ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఏప్రిల్ 21న విరూపాక్ష ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి.
Next Story