Mon Dec 23 2024 04:30:12 GMT+0000 (Coordinated Universal Time)
Sai Pallavi - Ashika : సిస్టర్స్ మ్యారేజ్స్ చేస్తున్న హీరోయిన్స్..
అందాల భామ సాయి పల్లవి, ఆషికా రంగనాథ్.. ప్రస్తుతం తమ సిస్టర్స్ పెళ్లి చేసే భాద్యతలను తీసుకున్నారు.
Sai Pallavi - Ashika Ranganath : అందాల భామలు సాయి పల్లవి, ఆషికా రంగనాథ్.. ప్రస్తుతం తమ సిస్టర్స్ పెళ్లి చేసే భాద్యతలను తీసుకున్నారు. ప్రెజెంట్ సాయి పల్లవి అండ్ ఆషికా.. సౌత్ లోని పలు బాషల్లో వరుస ఆఫర్స్ అందుకుంటూ కెరీర్ లో ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇక వీరిద్దరూ కెరీర్ మీద ఫోకస్ పెట్టడంతో.. వీరిద్దరి సిస్టర్ పర్సనల్ లైఫ్ పై ఫోకస్ పెట్టి పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఈ ఇద్దరు తమ సిస్టర్స్ పెళ్లి చేస్తూ ఎమోషనల్ అవుతున్నారు.
ఈ ఆదివారం జనవరి 21న సాయి పల్లవి తన చెల్లెలు పూజ కన్నన్ ఎంగేజ్మెంట్ ని గ్రాండ్ గా చేశారు. తన చెల్లెలు ప్రేమించిన 'వినీత్'తో.. చెల్లి పెళ్లిని సాయి పల్లవి చేయబోతున్నారు. ఎంగేజ్మెంట్ రింగ్స్ మార్చుకున్న ఈ జంట.. త్వరలోనే ఏడడుగులు వేయనున్నారు. కాగా ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోలను సాయి పల్లవి.. రీసెంట్ గా సోషల్ మీడియాలో షేర్ చేశారు. వాటివైపు మీరు ఓ లుక్ వేసేయండి.
ఇక అలాగే మరో హీరోయిన్ ఆషికా కూడా తన సిస్టర్ ని పెళ్లి పీటలు ఎక్కించేశారు. ఈ సోమవారం జనవరి 22న ఆషికా సిస్టర్ అనూష పెళ్లి గ్రాండ్ గా జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలను ఆషికా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. మరి ఆషికా సిస్టర్ పెళ్లి సందడిని కూడా చూసేయండి.
Next Story