Mon Dec 23 2024 04:54:19 GMT+0000 (Coordinated Universal Time)
NC23లో నాగచైతన్యకి జంటగా సాయి పల్లవి..? వీడియో వైరల్..!
నాగచైతన్య, చందూ మొండేటి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న 'NC23' లో హీరోయిన్ గా సాయి పల్లవి సెలెక్ట్ అయ్యిందా..?
ప్రేమమ్, సవ్యసాచి సినిమాలు తరువాత నాగచైతన్య, చందూ మొండేటి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న మరో సినిమా 'NC23'. గీతాఆర్ట్స్ పతాకం పై అల్లు అరవింద్, బన్నీ వాస్ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలయింది. ఈ చిత్రం కోసం మూవీ టీం మత్స్యకారులను కలుసుకొని వారి జీవన శైలు గురించి తెలుసుకోవడం, వారితో పాటు సముద్రంలో చేపలు వేటకు వెళ్లి ఆ లైఫ్ స్టైల్ గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేశారు.
తాజాగా ఈ మూవీలోకి హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది. 'షీ జాయిన్స్ NC23' అంటూ ఒక వీడియో షేర్ చేశారు. ఆ వీడియోలో హీరోయిన్ పేస్ కంప్లీట్ గా చూపించినప్పటికీ.. అందులో ఉన్నది సాయి పల్లవి అంటూ నెటిజెన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే సాయి పల్లవి ఎంట్రీ పై మూవీ టీం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. కాగా చైతన్య, సాయి పల్లవి.. ఇద్దరు కలిసి 'లవ్ స్టోరీ' సినిమాలో కలిసి నటించారు. ఆ మూవీలో వీరిద్దరి కాంబినేషన్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది.
ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. చైతన్య, చందూ మొండేటి కాంబినేషన్ లో వచ్చిన మొదటి మూవీ 'ప్రేమమ్'లో సాయి పల్లవి హీరోయిన్ గా చేయాల్సి ఉంది. కానీ అప్పుడు కుదరలేదు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లో సెట్ అయ్యినట్లు సమాచారం. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే.. రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతుంది. 2018లో గుజరాత్ నుంచి వేటకెళ్లిన 21 మంది మత్స్యకారులు అనుకోకుండా పాకిస్తాన్ కోస్ట్ గార్డ్స్ కి చిక్కుకున్నారు.
పాకిస్తాన్ లోనే కొన్నాళ్ళు జైలులో ఉన్న వారు భారత్ ప్రభుత్వం సహకారంతో అక్కడి నుంచి బయటపడ్డారు. ఇక ఆ మత్స్యకారుల్లో ఆంధ్రప్రదేశ్ ఎచ్చెర్ల మండలం కె మత్స్యలేశం విలేజ్ కి చెందిన గణగల్ల రామరావు అనే మత్స్యకారుడు కూడా ఉన్నాడు. అతని కథని ఆధారంగా తీసుకోని, ఆ స్టోరీ చుట్టూ ఒక అందమైన లవ్ స్టోరీని అల్లుకొని చందూ మొండేటి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.
Next Story