సాయి పల్లవి అడిగింది ఇచ్చేయాలి అంతే
సాయి పల్లవి కి తెలుగులో మంచి క్రేజ్ ఉన్న సంగతి తెల్సిందే. ఆ క్రేజ్ కాష్ చేసుకునే ఆమె తన రెమ్యూనరేషన్ ఇష్టమొచ్చినట్టు చెబుతున్న మన నిర్మాతలు ఓకే అనేస్తున్నారు. రీసెంట్ గా ఆమె తెలుగులో శర్వానంద్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో 'పడి పడి లేచె మనసు' అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
తాజా సమాచారం ప్రకారం కొన్ని సీన్స్ మరింత బాగా రావాలనే ఉద్దేశంతో దర్శక నిర్మాతలు రీ షూట్ ను ప్లాన్ చేశారట. అందుకుగాను సాయి పల్లవి డేట్స్ అడిగారట. ఆమె ఓకే చెప్పి ఒక కండిషన్ పెట్టిందని టాక్. ఆ ఇచ్చే డేట్స్ కి కూడా పారితోషికం ఇవ్వవలసిందేనని సాయిపల్లవి కోరిందట. అందుకు నిర్మాతలు ఓకే చెప్పారని టాక్.
ఆమె క్రేజ్ అటువంటిది. ఆమె ఎంత అడిగిన ఇచ్చేయాలి. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈసినిమాను సుధాకర్ - ప్రసాద్ నిర్మిస్తున్నారు. డిసెంబర్ 21వ తేదీన ఈసినిమా రిలీజ్ అవ్వబోతుంది