Fri Dec 20 2024 17:29:03 GMT+0000 (Coordinated Universal Time)
Ram Charan : రామ్చరణ్ సినిమాలో హీరోయిన్గా సాయి పల్లవి..
రామ్ చరణ్ తన ఫేవరెట్ హీరోయిన్ సాయి పల్లవితో కలిసి నటించబోతున్నారా..? RC16లో హీరోయిన్గా..
Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రం తరువాత నేషనల్ అవార్డు విన్నర్ బుచ్చిబాబు దర్శకత్వంలో RC16 చేయనున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్ లో మొదటి చిత్రంగా తెరకెక్కబోతున్న ఈ సినిమాకి మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ కూడా సహనిర్మాతులుగా చేస్తున్నాయి. ఇక ఈ భారీ ప్రాజెక్ట్ కోసం బుచ్చిబాబు భారీ స్టార్ కాస్ట్ ని సెలెక్ట్ చేస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా ఏ ఆర్ రెహమాన్ ని ఎంపిక చేశారు. అలాగే సినిమాలోని ఒక ఇంపార్టెంట్ రోల్ కోసం విజయ్ సేతుపతిని కూడా ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన మరో న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కి హీరోయిన్ కోసం లేడీ పవర్ స్టార్ ని ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.
రామ్ చరణ్ అభిమానులు కూడా ఈ న్యూస్ నిజమైతే బాగుంటు అంటూ కోరుకుంటున్నారు. ఎందుకంటే చరణ్ కి ఇష్టమైన హీరోయిన్ సాయి పల్లవి. ఈ విషయాన్ని చరణే ఒక సందర్భంలో తెలియజేశారు. రామ్ చరణ్ ఫేవరెట్ హీరోయిన్ పక్కన తమ అభిమాన హీరోని చూసుకోవాలని ఫ్యాన్స్ అంతా ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఈ వార్త వైరల్ అవుతుండడంతో తెగ సంబరపడిపోతూ.. ఇది నిజం కావాలంటూ కోరుకుంటున్నారు. మరి ఫ్యాన్స్ కోరిక నెరవేరుతుందా లేదా చూడాలి.
కాగా ఈ మూవీ పై మెగా అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈ మూవీ మాత్రం ఇప్పటిలో పట్టాలు ఎక్కేలా కనిపించడం లేదు. గేమ్ ఛేంజర్ షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తుండడంతో RC16 వెనక్కి వెళ్తూ వస్తుంది. ప్రస్తుతం శంకర్ ఇండియన్ 3ని కూడా తెరకెక్కించే పని ఉన్నారు. దీంతో గేమ్ ఛేంజర్ ని పక్కన పెట్టేశారు. ఈ విషయం చరణ్ అభిమానులను నిరాశ పరుస్తుంది. మరి ఇండియన్ నుంచి శంకర్ ఎప్పుడు బయటకి వస్తాడో..? ఎప్పుడు గేమ్ ఛేంజర్ పూర్తి చేస్తాడో చూడాలి.
Next Story