Mon Dec 23 2024 04:34:32 GMT+0000 (Coordinated Universal Time)
Pooja Kannan: సాయి పల్లవి చెల్లెలు ఎంగేజ్మెంట్ సెలబ్రేషన్స్ స్టార్ట్..
సాయి పల్లవి చెల్లెలు ఎంగేజ్మెంట్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. పూజ కన్నన్ ఇటీవలే తన ప్రియుడిని ఇన్స్టాగ్రామ్ ద్వారా..
Pooja Kannan : సాయి పల్లవి (Sai Pallavi) సిస్టర్ ‘పూజ కన్నన్’ సోషల్ మీడియా ద్వారా అందరికి తెలిసిన అమ్మాయే. సాయి పల్లవి లాగానే కనిపిస్తూ ఇన్స్టాగ్రామ్ లో మంచి ఫాలోయింగ్నే సంపాదించుకున్నారు. గతంలో పూజ కూడా ఒక తమిళ చిత్రంలో నటించారు. ఆ సినిమా తరువాత ఆమె మళ్ళీ నటించలేదు. అయితే ఫోటోషూట్స్, అక్క సాయి పల్లవితో సెల్ఫీలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంటారు.
ఇక రీసెంట్ గా తన ప్రియుడిని పరిచయం చేస్తూ ఓ పోస్ట్ వేసి అందర్నీ షాక్ చేశారు. అక్క కంటే ముందే పెళ్లి చేసుకోబోతున్నట్లు హింట్ ఇచ్చారు. ఇక తాజాగా ఎంగేజ్మెంట్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయంటూ ఇన్స్టా స్టోరీలో కొని ఫోటోలు షేర్ చేసి అందరికి తెలియజేశారు. ఆ ఫొటోల్లో సాయి పల్లవి కూడా కనిపిస్తుంది. పూజ ఏమో మెహందీతో పెళ్లి కూతురులా తయారు అవుతుంది.
అయితే ఈ ఎంగేజ్మెంట్ ఎప్పుడు..? ఎక్కడ..? జరగనుంది అనేది మాత్రం తెలియజేయలేదు. ఇక ఈ పిక్స్ అండ్ వీడియోలు చూసిన ఆడియన్స్.. పూజకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా పూజ ఇటీవల తన ప్రియుడిని అందరికి పరిచయం చేస్తూ ఇలా రాసుకొచ్చారు.. "స్వార్థం లేకుండా ప్రేమ చూపడం, ప్రేమ ప్రయాణంలో ఓర్పుతో, నిలకడతో ఉండడం.. వినీత్ దగ్గర నుంచే నేర్చుకున్నాను. నా సూర్యోదయానికి వినీత్ కిరణం లాంటివాడు" అంటూ రాసుకొచ్చారు.
Next Story