Mon Dec 23 2024 16:27:26 GMT+0000 (Coordinated Universal Time)
విరూపాక్ష ఫస్ట్ డే కలెక్షన్స్.. దుమ్ము దులిపేసిన సాయిధరమ్ తేజ్
టీజర్, ట్రైలర్ తో అంచనాలు పెంచిన మేకర్స్.. సినిమాతో మిస్టీక్ థ్రిల్లర్ ను చూపించి ఆడియన్స్ అంచనాలను దాటేశారు. ప్రతి సీన్
డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వంలో.. సాయిధరమ్ తేజ్ - సంయుక్త మీనన్ హీరో హీరోయిన్లుగా వచ్చిన తాజా చిత్రి విరూపాక్ష. ఏప్రిల్ 21న విడుదలైన ఈ సినిమా.. ఫస్ట్ షో కాస్త స్లో గా మొదలైనా.. ఆ తర్వాత పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. చాలాకాలం తర్వాత సాయిధరమ్ తేజ్ విరూపాక్షతో హిట్ అందుకున్నాడు.
టీజర్, ట్రైలర్ తో అంచనాలు పెంచిన మేకర్స్.. సినిమాతో మిస్టీక్ థ్రిల్లర్ ను చూపించి ఆడియన్స్ అంచనాలను దాటేశారు. ప్రతి సీన్ లోనూ సస్పెన్స్ ఉండటంతో.. తొలిరోజే ఓపెనింగ్స్ అదిరిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు ఫస్ట్ కలెక్షన్స్ భారీగానే వచ్చాయి. ఉదయం నుంచి రాత్రి వరకూ అన్ని షోలూ దాదాపు హౌస్ ఫుల్ అయ్యాయి. తొలిరోజు విరూపాక్ష తెలుగు రాష్ట్రాల్లో రూ.5 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. అన్ని ప్రాంతాల్లో కలిపి రూ.7 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిందని తెలుస్తోంది. ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ రూ. 22 కోట్లకు జరిగింది. తొలివారంలోనే బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది.
Next Story