మొత్తానికి సైరాదే పై చెయ్యి
ఐదు భాషల్లో నిన్న రిలీజ్ అయిన సైరా నరసింహారెడ్డి సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. నాలుగు భాషల్లో చిరుకి ఎదురు నిలిచే సాహసం ఎవ్వరూ చెయ్యకపోయినా బాలీవుడ్ [more]
ఐదు భాషల్లో నిన్న రిలీజ్ అయిన సైరా నరసింహారెడ్డి సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. నాలుగు భాషల్లో చిరుకి ఎదురు నిలిచే సాహసం ఎవ్వరూ చెయ్యకపోయినా బాలీవుడ్ [more]
ఐదు భాషల్లో నిన్న రిలీజ్ అయిన సైరా నరసింహారెడ్డి సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. నాలుగు భాషల్లో చిరుకి ఎదురు నిలిచే సాహసం ఎవ్వరూ చెయ్యకపోయినా బాలీవుడ్ లో మాత్రం హృతిక్ రోషన్ – టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన వార్ సినిమా మాత్రం సైరాకి పోటీగా తయారైంది. బాలీవుడ్ లోనే కాకుండా వార్ సినిమా ఇండియా వైడ్ గా పలు మెట్రో నగరాల్లోనూ విడుదలైంది. సైరా మేకర్స్ వార్ సినిమా పోటీతో కాస్త టెన్షన్ పడ్డారు ఎందుకంటే వార్ ప్రొడ్యూసర్స్ యశ్ రాజ్ ఫిలిమ్స్ బృందం వార్ కోసం బాలీవుడ్ మొత్తంలో ఎక్కువ థియేటర్స్ బ్లాక్ చేసేసి సైరా కి తక్కువ థియేటర్స్ వదిలారు.
హిందీలోనూ పాజిటీవే….
తాజాగా సైరాకి పోటీగా విడుదలైన వార్ సినిమాకి అనుకున్నంత పాజిటివ్ టాక్ పడలేదు. ఇక సైరా నరసింహారెడ్డికి తెలుగులోనే కాదు, హిందీలోనూ పాజిటివ్ రివ్యూస్ పడ్డాయి. సైరా సినిమాని బాలీవుడ్ క్రిటిక్స్ కూడా మెచ్చుకున్నారు. కానీ వార్ సినిమాకి మాత్రం క్రిటిక్స్ మాత్రమే కాదు ప్రేక్షకులు కూడా పాజిటివ్ టాక్ ఇవ్వలేదు. ప్రస్తుతం ఫామ్ లో ఉన్న టైగర్ ష్రాఫ్, గతంలో స్టార్ హీరో రేంజ్ ఉన్న హృతిక్ రోషన్ కలిసి నటించడంతో వార్ సినిమా మీద అందరిలో క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమా అంతా యాక్షన్ తో నిండిపోయి కాస్త ట్విస్ట్ లతో కూడుకుని ఉన్నప్పటికీ వార్ సినిమా ధూమ్, రేస్
సీరిస్ లా ఉందంటూ ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. ఇక పోటీ అని భయపడిన సైరా కి వార్ టాక్ తో కాస్త ఊరట లభించినట్లయ్యింది.